ప్రధాని భార్యకు కరోనా వచ్చిందని Work from Home

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్యకు కరోనా వచ్చింది. ఓ వేడుకకు బ్రిటన్ వెళ్లి వచ్చిన ఆమెకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు కరోనా సోకిందని తెలియడంతో ఆ ప్రధాని సైతం వర్క్ ఫ్రమ్ హోం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రధాని.. ఫోన్ కాల్స్, మీటింగ్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ క్రమంలోనే ట్రుడో.. గురువారం, శుక్రవారం ఒట్టవాలో జరగాల్సిన ఉన్న మీటింగ్‌లను కూడా రద్దు చేశారు. వాళ్లందరితో కేవలం ఫోన్ కాంటాక్ట్ లో మాత్రమే ఉండగలనని చెప్పారు.
అతని భార్యకు లో ఫీవర్ గా అనిపించడంతో వెంటనే హాస్పిటల్ కు చేర్పించినట్లు సమాచారం. ఆ ప్రధానిలో ఇంకా ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా.. ఎవరితోనూ కలవకుండా ఇంటి నుంచే కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. ‘ఏదేమైనప్పటికీ.. హెచ్చరికలు ఉల్లంఘించకుండా.. స్వయంగా ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఇంటి నుంచే పనిచేయాలనుకుంటున్నారు’ అని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
2019 డిసెంబరులో పుట్టిన కరోనా.. లక్షా 27వేల 70కేసులు నమోదు చేసింది. 115దేశాల్లో 4వేల 717మంది దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కెనడాలోనూ 100కు పైగా కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు.
See Also | భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం