Kim Jong : స్కిన్ జీన్స్, mulletలపై నిషేధం

దేశంలో mullet, స్కిన్నీ జీన్స్ లపై నిషేధం విధించారు ఉత్తర కొరియా నియంత కిమ్-జోంగ్-ఉన్. పాశ్చాత్య తరహా ఫ్యాషన్ పోకడలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Kim Jong : స్కిన్ జీన్స్, mulletలపై నిషేధం

Kim

Updated On : May 22, 2021 / 12:59 PM IST

Bans Mullets Skinny Jeans : దేశంలో mullet, స్కిన్నీ జీన్స్ లపై నిషేధం విధించారు ఉత్తర కొరియా నియంత కిమ్-జోంగ్-ఉన్. పాశ్చాత్య తరహా ఫ్యాషన్ పోకడలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చిరిగిపోయినట్లుగా ఉండే జీన్స్, నినాదాలతో ఉండే టీ షర్ట్స్, ముక్కు, పెదాలపై రింగులు ఉండడాన్ని కూడా నిషేధించారు. యుఎస్ తరహా పోకడలు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, చివరకు తన ప్రాభవం కోల్పోయే అవకాశం ఉందని అతను భావిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

పాశ్చాత్య ఫ్యాషన్లపై మోజు పెరుగుతోందని, ఇది అధికార వర్గాన్ని ఆందోళన పరుస్తోందని పలువురు వెల్లడిస్తున్నారు. 15 హెయిర్ కట్స్ ను మాత్రమే అనుమతించారు. దేశంలో అత్యధికులు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారని కిమ్ భావిస్తున్నట్లు సమాచారం. క్యాపిటలిస్టు టెండన్సీస్‌ అయిన జీన్స్‌, మినీ స్కర్ట్‌, టీ-షర్ట్లు, హెయిర్ స్టైల్‌ను పౌరులు అనుసరించవద్దంటున్నారు.

జీవనశైలిలో మార్పులు ఆర్థికంగా బలహీనంగా అయిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాశ్చాత్య పోకడలు, హెయిర్‌ స్టైల్‌ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిని పెట్టుబడిదారుల అనుకూలంగా భావించి నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం గతంలో కూడా హెచ్చరించింది.

Read More : Woman Commit Suicide : వద్దంటున్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని యువతి ఆత్మహత్య