Kim Jong Un : గాజా యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఉగ్రవాదులకు ఉత్తర కొరియా ఆయుధాల విక్రయం?
గాజా యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిడిల్ ఈస్ట్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను విక్రయించవచ్చని దక్షిణ కొరియా గూడచారి సంస్థ తెలిపింది....

Kim Jong Un
Kim Jong Un : గాజా యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిడిల్ ఈస్ట్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను విక్రయించవచ్చని దక్షిణ కొరియా గూడచారి సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్ధతుగా ఆయుధాలు అందించాలని కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ అధికారులను కోరినట్లు సమాచారం. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ 2023ఆగస్టు 6వతేదీన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ చిత్రంలో ఒక ప్రధాన ఆయుధ కర్మాగారంలో ఫీల్డ్ గైడెన్స్ ఇచ్చారు.
Also Read : Zika virus : కర్ణాటకలో జికా వైరస్ పాజిటివ్ కేసు…హైఅలర్ట్
మధ్యప్రాచ్యంలోని ఉగ్రవాద గ్రూపులకు ఆయుధాలను విక్రయించడాన్ని పరిగణించవచ్చని దక్షిణ కొరియా గూఢచార సంస్థను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అణు కార్యక్రమం కారణంగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా గతంలో హమాస్‌కు యాంటీ ట్యాంక్ రాకెట్ లాంచర్‌లను విక్రయించింది. గాజాలో యుద్ధం మధ్య ఉత్తర కొరియా మరిన్ని ఆయుధాలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించవచ్చని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు చెప్పారు.
Also Read : Money Laundering Case : పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఈడీ సమన్లు
దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ కిమ్ క్యు-హ్యూన్ చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ యుద్ధం నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నంలో భాగంగా కిమ్ జోంగ్ ఉన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించినప్పుడు హమాస్ ఉగ్రవాదులు ఉత్తర కొరియా ఆయుధాలను ఉపయోగించారని పాలస్తీనా పోస్ట్ చేసిన చిత్రాలు, వీడియోల నుంచి ఆధారాలు లభించాయి.హమాస్ ఉత్తర కొరియా ఎఫ్-7 రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్‌ను ఉపయోగించింది.
Also Read : Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం ‘టార్పెడో’
ఉత్తర కొరియా తయారు చేసిన ఎఫ్-7 రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లు, వార్‌హెడ్‌పై కనిపించాయి. గతంలో హమాస్ ఉగ్రవాదులు అనుమానిత ఉత్తర కొరియా బుల్సే-గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను ఉపయోగించారు. గత నెలలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని అల్-అహ్లీ అల్-అరబీ హాస్పిటల్ ఆసుపత్రిపై బాంబు దాడి చేసిందని ఆరోపించింది. కాగా హమాస్ చేసిన రాకెట్ ప్రయోగం విఫలమవడం వల్లే పేలుడు సంభవించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ ఘోరమైన ప్రతిఘటనను ప్రారంభించి హమాస్‌పై యుద్ధం ప్రకటించింది.