Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

పెళ్లికి ముందు..పెళ్లి సమయంలో ఫోటో షూట్ లు మాత్రమే కాదండోయ్.. విడాకులు తీసుకున్న తరువాత కూడా ఫోటో షూట్‌లు పెట్టుకునే సంప్రదాయం వచ్చేసింది. ఎంత సంతోషంగా ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా విడిపోవాలన్నట్లు ఓ అమ్మాయి కొత్త ట్రెండ్ కి తెర దింపింది.

Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

Divorce photo shoot

Updated On : April 13, 2023 / 3:48 PM IST

Divorce photoshoot : ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లు ఎక్కువయ్యాయి. పెళ్లికి ముందు గ్రాండ్‌గా ఫోటోలు, వీడియోలు దిగడం వాటిని పోస్ట్ చేయడం ట్రెండ్‌గా మారింది. అయితే ఇందులో కూడా ఓ వింత చోటు చేసుకుంది. విడాకులు (Divorce) తీసుకుంటూ కూడా ఫోటో షూట్‌లు (photoshoot) చేసే కొత్త సంప్రదాయం మొదలు కాబోతోంది. ఇదేం చోద్యం అనుకున్నా ఇది నిజం. సోషల్ మీడియాలో ఓ మహిళ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఔరా అని ఆశ్చర్యపోతారు.

Mukul Kundra : రోడ్ సైడ్ పుస్తకాలు అమ్ముతూ..ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ దాకా సాగిన ఓ రచయిత అందమైన జర్నీ వీడియో వైరల్

లారెన్ బ్రూక్ (Lauren Brooke) అనే మహిళ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. పెళ్లికూతురి గెటప్ లో ఎంత అందంగా తయారవుతారో.. అలాగే తయారై విడాకుల ఫోటో షూట్ జరుపుకుంది. ఇదేంటిది? అనుకున్నా ఇది నిజం. పెళ్లి దుస్తుల్ని, ఫోటోల్ని కాల్చి వేసింది. ఇప్పుడు ఈ విడాకుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లారెన్ బ్రూక్ తన ఫోటో షూట్ కోసం ఎరుపు రంగు అందమైన దుస్తులు ధరించింది. విడాకులు తీసుకుంటున్నట్లు రాసి ఉన్న బోర్డుని పట్టుకుని ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ఇంకో ఫోటోలో వివాహ సమయంలో వేసుకునే కొంగును కాల్చేసింది. పెళ్లి టైంలో తీసుకున్న ఫోటో ఫ్రేమ్ ను కాళ్లతో పగలగొట్టింది. ఇక ఆ ఫోటోని చించేసింది. ఈ ఫోటోలన్నీ @pubity ద్వారా Instagram లో షేర్ కావడంతో వీటిని చూసి జనం నోరెళ్లబెడుతున్నారు.

Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!

మీకు మంచే జరిగిందని కొందరు.. విడాకులు తీసుకోవడం ద్వారా కలిగే బాధ నుంచి బయటపడటానికి ఆమె చేసిన ఈ పని సరైనదే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా లారెన్ బ్రూక్ తన విడాకుల ఫోటో షూట్ ద్వారా మరో కొత్త ట్రెండ్ కి తెర తీసినట్లైంది.

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)