Lebanon Explosion: లెబనాన్‌లో భారీ పేలుడు..27 మంది మృతి..
లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 27మంది మృతి చెందారు. లెబనీస్ ఓడరేవు నగరం టైర్‌లోని పాలస్తీనా శిబిరంలో సంభవించిన ఈ పేలుడులో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

Lebanon Explosion
Lebanon Explosion: లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ లెబనీస్ ఓడరేవు నగరం టైర్‌లోని పాలస్తీనా శిబిరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 27మంది వరకు మృతి చెందారు. చాలామంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా చెబుతోంది. శుక్రవారం (డిసెంబర్ 10,2021) లెబనాన్‌లోని శరణార్థి శిబిరంలో పాలస్తీనా హమాస్ గ్రూపు కోసం నిల్వ ఉంచిన ఆయుధాలు పేలాయి. శిబిరంలో ఉన్న శుక్రవారం జరిగిన పేలుడు తర్వాత కనీసం 12 మంది గాయపడ్డారని నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కానీ చనిపోయినవారు 27మంది అని పక్కా సమాచారం.
బుర్జ్ అల్-షెమాలి క్యాంప్‌లోని అనుమానిత హమాస్ ఆయుధ డిపోలో పేలుడు జరిగింది. దర్యాప్తు ప్రారంభించాలని న్యాయమూర్తి భద్రతా బలగాలను ఆదేశించారని ప్రభుత్వ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనాతో పోరాడేందుకు నిల్వ ఉంచిన ఆక్సిజన్ డబ్బాలను మండించడం వల్ల పేలుడు సంభవించిందని షెహబ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
కాగా లెబనాన్ లోని 12 శరణార్థి శిబిరాల్లో 10వేల మంది పాలస్తీనా శరణార్థులు ఉన్నారు. అనేక సాయుధ పాలస్తీనియన్ వర్గాలు, హమాస్, ఫతాతో సహా, శిబిరాలను సమర్థవంతమైన నియంత్రిస్తున్నాయి.కాగా ఈ పేలుడు ఘటనపై లెబనీస్ భద్రతా అధికారి మాట్లాడుతూ..ఈ ఘటనలో మరణించినవారు 12మంది అని కానీ కచ్చితమైన సమాధానం అయితే లేదని పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశముందని తెలిపారు.