Washing Machine : తక్కువ ధరకే వాషింగ్ మెషీన్లు
అల్పాదాయ వర్గాలకు అందుబాటులో ఉండే వాషింగ్ మెషిన్ తయారు చేశాడు బ్రిటన్ కు చెందిన నవజ్యోత్. వీటిని త్వరలో ఇండియాకు తీసుకురానున్నారు.

Washing Machine
Washing Machine : వాషింగ్ మెషిన్ వచ్చిన తర్వాత మహిళలకు చాలావరకు పనితగ్గింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాషింగ్ మెషిన్ లు అందుబాటు ధరల్లో లేవు.. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనలేకపోతున్నారు. ఇలాంటి అల్పాదాయ వర్గాల కోసం తక్కువ ధర ఉన్న వాషింగ్ మెషీన్స్ భారత్ కు రానున్నాయి.
భారత్ మూలాలున్న నవజ్యోత్ సాహ్నీ అనే విద్యార్థి.. పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఓ వాషింగ్ మెషిన్ తయారు చేయాలనే ఉద్దేశంతో మూడేళ్ళ క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టాడు. దీనిని స్వచ్చంద సేవకులు, భాగస్వాములతో కలిసి ఇరాన్ లోని రెఫ్యూజీ క్యాంపులో ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఈ ప్రాజెక్టుపై నవజ్యోత్ మాట్లాడుతూ.. ఓ సారి తన స్నేహితురాలు దివ్యను కలిసేందుకు వారి ఇంటికి వెళ్లాలని. అక్కడ ఆమె బాగా మసిపట్టిన గ్యాస్ స్టవ్ తుడుస్తూ ఉండటం చూసి చలించిపోయినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఆమె బట్టలు కూడా ఉతికింది.
ఆమె కష్టం చూస ఎలాగైనా తక్కువ ధరలో ఓ వాషింగ్ మెషిన్ తయారు చేయాలనీ అనుకున్నానని, అనుకున్నదే తడవుగా పనులు మొదలు పెట్టి.. తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషిన్ ను దిగ్విజయంగా పూర్తి చేశానని తెలిపాడు. ఇక దానికి తన స్నేహితురాలి పేరునే పెట్టాడు.. దివ్య 1.5 పేరుతొ మొదటి వాషింగ్ మెషిన్ విడుదల చేశాడు.
స్వచ్చంద సంస్థ కేర్ ఇంటర్నేషనల్ సహకారంతో ఇరాన్ లోని మమ్రాషన్ శరణార్థుల శిభిరంలో 30 వాషింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి 300 మంది అవసరాలు తీరుస్తాయని నవజ్యోత్ తెలిపాడు. ఈ వాషింగ్ మెషిన్ వలన ఏడాదికి ఓ కుటుంబానికి 750 గంటల సమయం ఆదా అవుతుందని తెలిపారు.