బ్రేకింగ్ : కరోనా వైరస్ అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ కు గుండె దడగా ఉండటంతో పరీక్షల కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి వైరల్ ఫీవర్ రావటం తోటే జ్వరం , దగ్గు వచ్చిందని.. దానివల్ల గుండె దడగా ఉందని చెప్పి రెండు రోజుల పాటు చికిత్స చేసి డాక్టర్లు ఇంటికి పంపించారు.
ఆదివారం ఫిబ్రవరి9వ తేదీ సాయంత్రానికి స్వగ్రామ చేరుకున్న బాలకృష్ణ తనకు కరోనా వైరస్ సోకిందని ఎవరూ తన వద్దకు రావద్దని, ముట్టుకోవద్దని చెప్పి అందరికీ దూరంగా ఉండసాగాడు. తన దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమి కొట్టి గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు పోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు.
సోమవారం తెల్లవారు జామున బాలకృష్ణ గదిలోంచి.. తాళం తీసుకుని బయటకు వచ్చితన పొలానికి వెళ్లాడు. అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్నచెట్టుకు ఉరేసుకుని ఆత్య హత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.
మరోవైపు…. కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభించడంతో ఒక రోజులోనే మృతుల సంఖ్య 103కి చేరింది. ఆదివారం 91 మృతుల సంఖ్య ఉండగా, సోమవారం నాటికి వంద దాటేసింది.
WHO, చైనీస్ వైద్యాధికారుల ప్రకారం.. చైనాలో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసులు 42వేలుగా అధికారులు ధ్రువీకరించారు. 24 ఇతర దేశాల్లో మొత్తంగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. మరోవైపు.. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న 3,700 మంది ప్రయాణికులు, సిబ్బందిని జపాన్ లోని యోకోహ్మా పోర్టులో నిర్బంధించారు. ఓడలో ప్రయాణిస్తున్నవారిలో 65 కరోనా కేసులు నమోదయ్యాయి.