90శాతం సక్సెస్ రేటుతో Moderna కొవిడ్-19 వ్యాక్సిన్.. ఫైనల్ హ్యుమన్ ట్రయల్స్ షురూ!

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తునా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశోధనలు చివరిగా దశగా చేరుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పలు కంపెనీల్లో ముందుంజలో నిలిచింది Moderna కంపెనీ. SARS CoV2 వ్యాక్సిన్ పై పనిచేస్తు్న్నట్టు ప్రకటించిన మొట్టమొదటి కంపెనీ కూడా Moderna. అంతేకాదు.. వ్యాక్సిన్ కోసం హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించిన మొదటి ఫార్మా కంపెనీ కూడా.
జూలైలో ఫైనల్ ట్రయల్ ప్రారంభించేందుకు కంపెనీ షెడ్యూల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మోడిర్నా సీఈఓ Stephane Bancel ప్రకారం.. ఈ కంపెనీ తయారు చేసే Covid-19 వ్యాక్సిన్ 80 శాతం నుంచి 90 శాతం వరకు FDA ఆమోదం పొందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా ప్లాట్ ఫాం ఏంటో మాకు తెలుసు. MERS, Zika, CMV వంటి వైరస్ లపై కూడా మా వ్యాక్సిన్ పనిచేస్తుంది. సరైన క్రమంలో యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేయగలదు’ అని పేర్కొన్నారు. మార్కెట్లో ఏ ఒక్క ప్రొడక్ట్ లేని 10 ఏళ్ల ఫార్మా ఔషధ సంస్థ పరిశ్రమలో అతిపెద్ద ఔషధ దిగ్గజాలను ఎలా సవాలు చేస్తోందనే దానిపై ఆయన ఐదు కారణాలను ప్రతిపాదించారు.
మోడెర్నా COVID-19 టీకా టెక్ :
మొదటి కారణం ఇదే.. mRNA లేదా మెసెంజర్ RNA. MRNA తప్పనిసరిగా జన్యు సంకేతమే. ప్రోటీన్లను ఎలా ఏర్పరుచుకోవాలో ఇది కణాలకు నిర్దేశిస్తుంది. వైరస్ ప్రోటీన్ల మాదిరిగానే కనిపించే ప్రోటీన్లను తయారు చేయడానికి శరీరం స్వంత సెల్యులార్ మెకానిజాలను mRNA సూచిస్తుంది. తద్వారా రోగనిరోధక తొందరగా స్పందిస్తుంది. మోడెనా ఈ వ్యాక్సిన్ మొదటి మోతాదును కేవలం 42 రోజుల్లో NIAID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్)కు అందించింది.
మోడెర్నా 10వ వ్యాక్సిన్ అభివృద్ధి:
రెండో కారణం ఏమిటంటే? వాస్తవానికి మోడెర్నా అభివృద్ధి చేసిన 10వ వ్యాక్సిన్. దీనికి ముందు, మోడెర్నా అత్యంత సంక్లిష్టమైన సైటోమెగలోవైరస్ లేదా CMV నిరోధక వ్యాక్సిన్ డెవలప్ చేసింది. టీకాలను అభివృద్ధి చేయడంలో ఎక్కువ అనుభవం ఈ కంపెనీకి ఉందని చెప్పవచ్చు.
మోడెర్నా కరోనా వైరస్ కనెక్షన్ :
మూడవ కారణాన్ని వివరిస్తూ.. మోడెర్నా గతంలో MERS (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్‌పై కూడా పనిచేశారని ( కరోనావైరస్ కూడా). ఆ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ఎన్నడూ చేయలేదు. అయినప్పటికీ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌తో సహకారం COVID-19పై వర్క్ చేసేందుకు దోహదం చేసింది.
మోడెర్నా మ్యానిఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ :
mRNA-1273తో అభివృద్ధి చేసిన మోడెర్నా COVID-19 వ్యాక్సిన్ ఆరు నెలల వ్యవధి తర్వాత మూడో దశ ట్రయల్‌లో 30వేల మందికి త్వరలో ఇవ్వనుంది. కరోనా కేసుల్లో ఎక్కువగా కనిపిస్తున్న లక్షణ రహిత కరోనా వ్యాప్తిని అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యంగా కంపెనీ పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా దాని నివారణను సూచించడమే తమ రెండో లక్ష్యమని కంపెనీ వెల్లడించింది.
Read: మీలో తలనొప్పి, మైగ్రేన్ తరచూ వస్తోందా? కొవిడ్-19 కారణం కావొచ్చు..!