ఏటా 100మంది సైనికులు ఆత్మహత్య : USI అధ్యయంలో వెల్లడి

indian Army 100 soldiers commit suicide : దేశ కోసం ప్రాణాలు అర్పించే ఇండియన్ ఆర్మీ జనవాన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం చాలా విచారించదగిన విషయం. దేశం కోసం ప్రాణాల్ని పణ్ణంగా పెచ్చే జవాన్ల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతీ ఏటా 100మంది సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారత సైన్యంలో శతృవులతో చేసే యుద్ధాల్లో చనిపోయేవారి కంటే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నజవానుల సంఖ్య అధికంగా ఉంటోంది.
దీనితోపాటు భారత సైన్యంలోని సగం మంది సైనికులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని థింక్ ట్యాంక్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా(యూఎస్ఐ) జరిపిన అధ్యయనంలో భారత సైన్యానికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకొచ్చాయి.భారత సైన్యంలో ప్రతీయేటా ఆత్మహత్యల కారణంగా 100మందికి పైగా జవానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసింది.
గత రెండు దశాబ్దాలుగా భారత ఆర్మీ సిబ్బందిలో ఒత్తిడి స్థాయిలు గణనీయంగా పెరుగుదల ఉందని అధ్యయనంలో తేలింది. అలాగే భారత ఆర్మీలో సిబ్బందిలో సగానికి పైగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని గత నెలలలో USI వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన అధ్యయం తెలిపింది. భారతసైన్యంలో ప్రతీ మూడో రోజూ ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీనికితోడు ఒత్తిడి, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యల కారణంగానూ పలువురు జవానులు ప్రాణాలు కోల్పోతున్నారు.
భారతీయ సైనికులు దీర్ఘకాలం పాటు ఉగ్రవాదులు, విద్రోహులతో పోరాడుతూ, అటువంటి పరిస్థితుల్లో వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గత రెండు దశాబ్దాలలో ఆపరేషన్, నాన్ ఆపరేషన్ల కారణంగా భారతీయ సైనిలకులలో ఒత్తిడి స్థాయి పెరిగిందనీ..దీనికితోడు సైనికుల సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, ఇంటి సమస్యలు, ఉన్నతాధికారుల నుంచి కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవమానాలు, మొబైల్ ఫోను వాడకంలో నిబంధనలు వంటి పలు అంశాలు జవానుల ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయి. ఈ కారణాలతోనే కొంతమంది జవాన్లు ఒత్తిడి జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూఎస్ఐ అధ్యయనంలో వెల్లడయ్యింది.