Donald Trump : ఇండియాపై మళ్లీ టారిఫ్ బాంబ్.. ట్రంప్ వార్నింగ్

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతామని అన్నారు.

Donald Trump : ఇండియాపై మళ్లీ టారిఫ్ బాంబ్.. ట్రంప్ వార్నింగ్

donald Trump

Updated On : January 5, 2026 / 2:38 PM IST

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే భారత్ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న పలు ఉత్పత్తులపై ఆ దేశం 50శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతామని అన్నారు.

Also Read : kalvakuntla Kavitha : నన్ను ఘోరంగా అవమానించారు.. శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత

డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆడియో క్లిప్‌ను సోమవారం వైట్‌హౌస్ మీడియాకు విడుదల చేసింది. ఈ ఆడియోలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ హెచ్చరించాడు.

ఆ ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. ‘‘వాళ్లు (భారత్) నన్ను సంతోషపెట్టాలని భావించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేననే విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. రష్యాతో వారు వ్యాపారం కొనసాగిస్తే.. మనం చాలా వేగంగా టారిఫ్‌లు పెంచుతాం’ అని ట్రంప్ హెచ్చరించారు.

రష్యాతో భారత్ స్నేహంగా ఉండటాన్ని.. మరీ ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకోవటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. రష్యా నుంచి భారతదేశాన్ని దూరం చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో పలుసార్లు భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అధికశాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగుతూ వస్తున్నాడు. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై ట్రంప్ సర్కార్ 50శాతం టారిఫ్‌లు విధించింది. అయితే, తాజాగా మరోసారి భారత్, రష్యా వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ఫైర్ అయ్యాడు.

భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో బైలటెరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ (బీటీఏ) చేసుకోవాలని ఇండియా చూస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ట్రంప్ భారత్ పై టారిఫ్‌లను పెంచుతామంటూ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.