స్పేస్ నుంచి ఓటు వేస్తానంటోన్న NASA Astronaut

NASA Astronaut తన ఓటు హక్కును అంతరిక్షం నుంచే వినియోగించుకుంటానని చెప్తుంది. రాబోయే 2020 ప్రెసిడెన్షియల్ electionలో దాదాపు భూమి నుంచి 200 మైళ్లకు పైగా ఎత్తున్న తలం నుంచి ఓటును వినియోగించుకుంటానని చెప్పింది. ర్యూబిన్స్ (41) ఓటు ప్రాముఖ్యతను దానిని వినియోగించుకోలకపోతే ఎలా దుర్వినియోగం అవుతుందో మాట్లాడారు.
‘నాకు తెలిసి ఇది నిజంగా చాలా ముఖ్యం. నేను స్పేస్ నుంచి ఓటు వేయగలిగితే మనవాళ్లు భూమి మీద నిర్లక్ష్యం చూపించకుండా ఓట్లు వేస్తారని అనుకుంటున్నా’ అని చెప్పారు. గతంలో అంటే 2016 ఎన్నికల్లోనూ ఆమె స్పేస్ లో ఉండే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేసినట్లు సమాచారం.
కొన్ని సంవత్సరాల క్రితమే అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఓటు హక్కు గురించి చట్టం వచ్చింది. నాకు తెలిసి చాలా మంది ఆస్ట్రోనాట్స్ ఈ పనిచేశారు. వారంతా దీనిని చాలా కీలకంగా భావించారు. మన ప్రజాస్వామ్యంలో పాల్గొనడమనేది చాలా కీలకం. దీనిని ఒక గౌరవంగా భావిస్తున్నా. అని చెప్పారు.
నాసా అధికారిక టంబ్లర్ అకౌంట్ సమాచారం మేరకు ఇలా ఆస్ట్రోనాట్స్ ఓటును తొలిసారి వినియోగించుకుంది 1997లో. అదే సంవత్సరం టెక్సాస్ లా అమల్లోకి వచ్చింది. అయితే ఆస్ట్రోనాట్స్ కోసం దీని గురించి అప్పటికప్పుడే కాకుండా ఓ సంవత్సరం ముందునుంచే ఏర్పాట్లు మొదలుపెడతారట. లోకల్, స్టేట్ లేదా ఫెడరల్ ఎన్నికలను బట్టి బ్యాలెట్ పేపర్లు రెడీ అవుతాయట.