100 డైనమేట్లతో పేల్చేశారు: నీరవ్ మోడీ రూ.100 కోట్ల భవనం నేలమట్టం

  • Published By: vamsi ,Published On : March 8, 2019 / 09:10 AM IST
100 డైనమేట్లతో పేల్చేశారు: నీరవ్ మోడీ రూ.100 కోట్ల భవనం నేలమట్టం

వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ బంగ్లా నేలమట్టం అయింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ ఇంటిని ప్రభుత్వం నాశనం చేసింది. రాయగడ్ జిల్లా అలీబాగ్‌లో పటిష్టంగా నిర్మించిన బంగ్లాను కలెక్టర్ సమక్షంలో శుక్రవారం నేలమట్టం చేశారు. 
Also Read : ATMకు వెళ్తున్నారా? : కార్డు గికేటప్పుడు జాగ్రత్త!

రాయ్‌గడ్‌లోని అక్రమ కట్టడాలు, భవనాలు పర్యవరణానికి హానీ చేకూర్చే విధంగా ముంబై హైకోర్టులో 2009లోనే పిల్ నమోదైంది. కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పాటు రాష్ట్ర్ర ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేవనే కారణంతో నీరవ్ మోడీ ఇంటిని కూడా కూల్చేయమంటూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా పటిష్టమైన ఇంటి నిర్మాణాన్ని కూల్చి వేయడం కష్టమవుతుండటంతో అధికారుల డైనమెట్లతో పేల్చి వేసేందుకు నిర్ణయించారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

ముంబైకి 90కి.మీ దూరంలో కిహీమ్ బీచ్ ఒడ్డున విలాసవంతంగా నిర్మించారు. పటిష్టమైన సెక్యూరిటి గేట్ ,స్విమ్మింగ్ పూల్, తో గ్రౌండ్ ప్లస్ వన్ ప్లోర్‌ను నిర్మించారు. నిర్మాణాన్ని బట్టి బుల్‌డోజర్లతో కూల్చడం కష్టమని భావించిన అధికారులు 100 డైనమైట్లు వినియోగించి ధ్వంసం చేశారు. 33వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మించిన భవనం విలువ  రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. 

Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు