జాదవ్ కేసులో పాక్ క్లారిటీ : భారత్‌తో ఒప్పందం లేదు.. ఆ ప్రకారమే చర్యలు

  • Published By: sreehari ,Published On : November 14, 2019 / 02:24 PM IST
జాదవ్ కేసులో పాక్ క్లారిటీ : భారత్‌తో ఒప్పందం లేదు.. ఆ ప్రకారమే చర్యలు

Updated On : November 14, 2019 / 2:24 PM IST

భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య అయినా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందని స్పష్టం చేసింది. 

జాదవ్ కేసును సమీక్షించడానికి ప్రభుత్వం వివిధ చట్టపరమైన ఎంపికలను పరిశీలిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన ఒక రోజు తర్వాత విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైసల్ మాట్లాడుతూ.. ఎటువంటి ఒప్పందం ఉండదు. అన్ని నిర్ణయాలు స్థానిక చట్టాల ప్రకారమే ఉంటాయి’ అని అన్నారు.

ఏప్రిల్ 2017 లో ట్రయల్ ముగిసిన తరువాత గూఢచర్యం, తీవ్రవాదం ఆరోపణలపై పాకిస్తాన్ సైనిక కోర్టు రిటైర్డ్ భారత నావికాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ (49)కు మరణశిక్ష విధించింది. వ్యాపార ప్రయోజనాల నిమిత్తం వెళ్లిన జాదవ్ ను.. ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని భారత్ ఆరోపించింది. నేవీ నుంచి రిటైర్ అయిన తరువాత.. జాదవ్‌కు విధించిన మరణశిక్షను పాకిస్తాన్ తప్పక సమీక్షించాలని జూలై 17న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.