North Korea Fire Missile: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం.. జపాన్‌లో కలకలం

ఉత్తర కొరియా నుంచి ప్రయోగించిన క్షిపణి బహుశా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని జపాన్ రక్షణ మంత్రి చెప్పారు. క్షిపణి దాదాపు వెయ్యి కిలో మీటర్లు (620 మైళ్లు) ఎగిరిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.

North Korea Fire Missile: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం.. జపాన్‌లో కలకలం

North Korea Fire Missile

Updated On : April 13, 2023 / 9:42 AM IST

North Korea Fire Missile: ఉత్తర కొరియా (North Korea) గురువారం బాలిస్టిక్ క్షిపణి (Ballistic missile) ని ప్రయోగించింది. ఈ క్షిపణి కొరియా ద్వీపకల్పం, జపాన్ (Japan) మధ్య పడింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంతో జపాన్ ప్రభుత్వం (Japan Government) అప్రమత్తమైంది. హక్వైడ్‌లో నివసించే ప్రజలను ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని ఆదేశాలు జారీ చేసింది. అయితే, జపాన్ కాలమానం ప్రకారం.. ఉదయం 8గంటలకు క్షిపణి పడిపోయిందని కూడా హెచ్చరికల్లో పేర్కొంది. ఉత్తర కొరియా నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి తొలుత జపాన్ భూభాగంపై పడుతుందని అక్కడి అధికారులు అంచనా వేశారు. ఆ తరువాత క్షిపణి జపాన్ భూభాగంలో పడలేదని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా ట్వీట్ ద్వారా తెలిపారు.

North Korea: తీవ్ర కలకలం.. అణు పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధం.. అణ్వస్త్ర సామర్థ్య బాంబర్లను పంపిన అమెరికా

ఉత్తర కొరియా నుంచి ప్రయోగించిన క్షిపణి బహుశా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని జపాన్ రక్షణ మంత్రి చెప్పారు. క్షిపణి దాదాపు వెయ్యి కి.మీ (620 మైళ్లు) ఎగిరిందని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. దీనిని తీవ్రమైన రెచ్చగొట్టడంగా పేర్కొంది. ఇదిలాఉంటే ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణు పరీక్షలు నిర్వహించింది. గతేడాది రికార్డు స్థాయిలో 70కిపైగా క్షిపణి పరీక్షలు జరిపింది. అదేవిధంగా 2023లో ఇప్పటి వరకు 30కిపైగా క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు‌కూడా ఉన్నాయి. అయితే, తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే ఈ క్షిపణుల ప్రయోగం ఉద్దేశమని తెలుస్తోంది.

North Korea: అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది పౌరులు సిద్ధం: ఉత్తర కొరియా

అమెరికా ఎన్నడూ లేనంత భారీగా దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతోంది. సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని పలు సార్లు ఉత్తర కొరియా హెచ్చరించింది. నిషేధిత ఆయుధ పరీక్షలు చేయాలని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం నుంచి ముప్పు పెరగడంతో అమెరికా, దక్షిణ కొరియా యుద్ధ సన్నాహాలు, సంసిద్ధత కోసం విన్యాసాలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత నాలుగు రోజుల క్రితం తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, దక్షిణ కొరియాల పై అణుదాడికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ ధృవీకరించింది.