North Korea: తీవ్ర కలకలం.. అణు పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధం.. అణ్వస్త్ర సామర్థ్య బాంబర్లను పంపిన అమెరికా

నిషేధిత ఆయుధాల పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఇటు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యమున్న బాంబర్లను పంపి, దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేస్తోంది.

North Korea: తీవ్ర కలకలం.. అణు పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధం.. అణ్వస్త్ర సామర్థ్య బాంబర్లను పంపిన అమెరికా

North Korea

North Korea: కొరియా ద్వీపకల్పం (Korean Peninsula)లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పుడు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యమున్న ఆయుధాలనూ ప్రదర్శిస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తర కొరియా ముందు నుంచి బెదిరించినట్లే అణ్వాయుధాల పరీక్షలకు సిద్ధమైంది. దీంతో ఇవాళ అమెరికా యుద్ధ విమానాలు అణ్వస్త్ర సామర్థ్యమున్న బీ-52 బాంబర్ల (B-52 bombers)తో ఇవాళ కొరియా ద్వీపకల్పంలో చక్కర్లు కొట్టింది.

దక్షిణ కొరియా (South Korea)తో కలిసి చేస్తోన్న సైనిక విన్యాసాల్లో భాగంగా అమెరికా బీ-52 బాంబర్లను వాడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా రక్షణ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయనుందని అమెరికా నిఘా విభాగం కొన్ని నెలల ముందుగానే పసిగట్టింది. అప్పటి నుంచి అమెరికా వైమానిక దళం మరింత అప్రమత్తమైంది.

దీంతో అమెరికాతో పోరాడేందుకు తమ దేశ పౌరులు 8,00,000 మంది స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా కూడా రెండు వారాల క్రితమే ప్రకటన చేసింది. హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించిన సమయంలో ఉత్తర కొరియా ఈ ప్రకటన చేసింది.

దీంతో అమెరికా ఎన్నడూ లేనంత భారీగా దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతోంది. సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని పలు సార్లు ఉత్తర కొరియా హెచ్చరించింది. నిషేధిత ఆయుధ పరీక్షలు చేయాలని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం నుంచి ముప్పు పెరగడంతో అమెరికా, దక్షిణ కొరియా యుద్ధ సన్నాహాలు, సంసిద్ధత కోసం విన్యాసాలు చేపట్టాయి.

Donald Trump: నేను దోషిని కాదు..! ప్రపంచం మన దేశాన్ని చూసి నవ్వుతోంది.. డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, విడుదల