Shakira : మొదటిసారి కెమెరా ఫోన్ చూసి ఆ సింగర్ రియాక్షన్ చూడండి.. వైరలవుతున్న వీడియో

మొదటిసారి కెమెరా ఫోన్ చూసి మీరు ఎలా రియాక్టై ఉంటారు? గుర్తు తెచ్చుకోండి. అలాగే పాప్ సింగర్ షకీరా ఎలా రియాక్టైందో కూడా వైరల్ వీడియోలో చూడండి.

Shakira  : మొదటిసారి కెమెరా ఫోన్ చూసి ఆ సింగర్ రియాక్షన్ చూడండి.. వైరలవుతున్న వీడియో

Shakira

Updated On : October 27, 2023 / 5:58 PM IST

Shakira : కొత్తగా ఆవిష్కరించబడిన వస్తువుల్ని చూస్తే అందరికీ విచిత్రంగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ కెమెరాతో వీడియో కాల్స్, రీల్స్ అన్నీ క్షణాల్లో తీసేస్తున్నారు. కానీ మొబైల్ కెమెరా వచ్చిన కొత్తలో దానిని చూస్తే ఎంత అపురూపంగా అనిపించిందో ఓ సింగర్ పాత వీడియో చూస్తే అర్ధమవుతుంది. నటి, పాప్ సింగర్ షకీరా ఓల్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Chhattisgarh : ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు వీడియో వైరల్

1973 ఏప్రిల్ 3 న మోటరోలాకు చెందిన మార్టిన్ కూపర్ న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లోని సిక్స్త్ అవెన్యూలో పేవ్‌మెంట్‌పై నిలబడి AT&T యాజమాన్యంలోని బెల్ ల్యాబ్స్ అధిపతి జోయెల్ ఎంగెల్‌కు మొదటిసారి ఫోన్ చేసినపుడు ప్రపంచం ఎంతలా ఆశ్చర్యపోయిందో అందరికీ తెలుసు. ఆ తరువాత రోజురోజుకి సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు చేతిలో ఫోన్ పెట్టుకుని సెల్ఫీలు, వీడియో కాల్స్, రీల్స్ వంటివి క్షణాల్లో చేస్తున్నారు. అయితే కెమెరాతో ఉన్న మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో అంటే 2002 నాటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Anchor Suma : విలేకర్లు, యాంకర్ సుమ మధ్య గొడవ.. సారీ చెప్పిన వీడియో వైరల్..

2002 లో షకీరా కెమెరాతో ఉన్న మొబైల్ ఫోన్‌ను మొదటిసారి ఎంతో ఆశ్చర్యంగా పట్టుకుని చూస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫోన్ చూపిస్తున్న మహిళను ‘అది కెమెరానా?’ అని కూడా అడుగుతుంది. ఆ మహిళ ఆ ఫోన్‌లో ఫోటోలను షకీరాకు చూపిస్తుంది. వాటిని చూసిన షకీరా ‘ఓ నా దేవుడా’ అని మరింత ఆశ్చర్యంగా ఫోన్ పట్టుకుని చూస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘వావ్.. ఇప్పుడు ఆమె ముందు మిలియన్ కెమెరా ఫోన్లు క్లిక్ మంటాయి’ అంటూ కామెంట్లు చేసారు. మొత్తానికి షకీరా ఓల్డ్ వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతోంది.