అద్భుతం : అమ్మ కడుపులో 6 నెలల శిశువుకు ఆపరేషన్ 

తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువుకు వైద్యులు ఆపరేషన్ చేశారు బ్రిటన్ డాక్టర్స్. బెథాన్ సింప్సన్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువులో వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించారు. ఈ క్రమంలో పుట్టిన తరువాత బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఆ సమస్యను తల్లి గర్భంలో ఉండగానే ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు.

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 10:30 AM IST
అద్భుతం : అమ్మ కడుపులో 6 నెలల శిశువుకు ఆపరేషన్ 

తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువుకు వైద్యులు ఆపరేషన్ చేశారు బ్రిటన్ డాక్టర్స్. బెథాన్ సింప్సన్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువులో వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించారు. ఈ క్రమంలో పుట్టిన తరువాత బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఆ సమస్యను తల్లి గర్భంలో ఉండగానే ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు.

బ్రిటన్ : ఒకప్పుడు చిన్నపాటి అనారోగ్యానికే ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి నుండి సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థానికి వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. నిన్న మొన్నటి వరకూ కడుపులో ఉండే శిశువు ఆరోగ్య పరిస్ధితి తెలుసుకునేందు స్కానింగ్ ల ద్వారా తెలుసుకునేవారు. ఒకవేళ ఆ శిశువు ఆరోగ్యం పరిస్థితి ప్రమాదంగా ఉందని తెలిస్తే దానికి తగిన చర్యలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం ఎవరూ ఊహించని విధంగా డెవలప్ అవుతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తల్లి కడుపులో ఉన్న ఆరు నెలల శిశువుకి ఆపరేషన్ చేసారు డాక్టర్స్. ఇదొక అద్భుతంగా భావించవచ్చు. 
 
తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువుకు వైద్యులు ఆపరేషన్ చేశారు బ్రిటన్ డాక్టర్స్. బెథాన్ సింప్సన్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువులో వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించారు. ఈ క్రమంలో పుట్టిన తరువాత బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఆ సమస్యను తల్లి గర్భంలో ఉండగానే ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. ఆ శిశువులో ‘స్పైనా బిఫిడా’ సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి వెన్నెముకలో ఏర్పడిన రంధ్రానికి సర్జరీ చేసి పూడ్చివేశారు. దీని కోసం నాలుగు గంటల సమయం పట్టిందని..ఆరు నెలల గర్భిణి అయిన బెథాన్ ఏప్రిల్‌లో బిడ్డకు జన్మనివ్వనుందని  డాక్టర్స్ తెలిపారు.