చైనాలో మరో వైరస్ కలకలం…ఒక్క సిటీలోనే 6వేలకు పైగా పాజిటివ్ కేసులు

Over 6,000 people in China test positive for brucellosis చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. గన్సు ఫ్రావిన్స్ లోని లాన్ జౌలో 6వేల మందికి “బ్రూసెల్లోసిస్” అని పిలువబడే బ్యాక్టీరియల్ డిసీజ్ పాజిటివ్ గా తేలిందని స్థానిక ప్రభుత్వ అధికారులు చెప్పారు. లాన్ జౌ సిటీలో 55వేల 725మందికి టెస్టులు చేయగా..వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ కు పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
ఏడాది క్రితం తొలిసారి చైనాలోని పశుసంవర్ధకశాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో నుంచి ఈ వైరస్ లీక్ అయినట్లు లాన్ జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కాగా,జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల, కలుషితమైన జంతుఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెలోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.