Bilawal Bhutto: ఇండియాలో పర్యటనపై పాక్ విదేశాంగ మంత్రి భుట్టో కీలక వ్యాఖ్యలు.. భారత టీవీ ఛానళ్లపై నిషేధం
పాకిస్థాన్‌లో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిషేదిస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది.

Bilawal Bhutto Zardari
Bilawal Bhutto: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) భారత పర్యటన (India Tour) కు రానున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ అందుకుంది. మంత్రుల స్థాయి సమావేశలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మే 4, 5 తేదీల్లో గోవా వేదికగా విదేశాంగ మంత్రుల భేటీ ఏర్పాటు చేసింది. ఈ భేటీలో పాల్గొనాలని ఎస్‌సీఓ దేశాలకు భారత్ ఆహ్వానం పంపించింది ఆ దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉండటంతో పాకిస్థాన్ కు భారత్ ఆహ్వానం అందించింది. ఈ క్రమంలో ఎస్‌సీఓ దేశాల మంత్రుల బృందంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు రానున్నారు.
Bilawal Bhutto India Visit: భారత్ పర్యటనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఎప్పుడంటే..
2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత పాకిస్థాన్ నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు భారత్‌లో పర్యటించలేదు. బిలావల్ భుట్టో మే 4, 5 తేదీల్లో గోవాల్లో జరిగే సమ్మిట్ లో పాల్గొంటారు. ఈ పర్యటనపై బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌సీఓ సదస్సులో తాను పాల్గొనడం ఎస్‌సీఓ చార్టర్ పట్ల పాకిస్థాన్‌కు గల నిబద్దతకు అద్దం పడుతుందని అన్నారు. తన పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ అన్నారు.
Karnataka Polls: మోదీ దేవుడు కాదు.. నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్
2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. 2011 సంవత్సరంలో హీనారబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. ఆమె తరువాత విదేశాంగ మంత్రుల హోదాలో పాక్ నుంచి ఎవరూ భారత్‌లో పర్యటించలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందిందని ఈ ఏడాది జనవరి నెలలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
2001లో షాంఘైలో ప్రారంభించిన ఎస్‌సీఓ దాని ఆరు వ్యవస్థాపక సభ్యులైన చైనా, కజకిస్థాన్, కిర్గిజస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బేకిస్తాన్‌లతో పాటు ఎనిమిది మంది పూర్తి సభ్యులను కలిగి ఉంది. 2017లో భారత్, పాకిస్థాన్ దేశాలు పూర్తి సభ్యులుగా చేరాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ లోని పూంచ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన విషయం విధితమే. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదు.
పాకిస్థాన్‌లో భారత టీవీ ఛానళ్లపై నిషేదం..
పాకిస్థాన్ లో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిషేదిస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అతిక్రమించే కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.