ఉప్పు ఇచ్చారు…కరోనా అంటించారు…జర్మనీలో కరోనా ఇలా మొదలైంది

  • Published By: chvmurthy ,Published On : April 10, 2020 / 03:12 PM IST
ఉప్పు ఇచ్చారు…కరోనా అంటించారు…జర్మనీలో కరోనా ఇలా మొదలైంది

Updated On : April 10, 2020 / 3:12 PM IST

జనవరి… జర్మనీ… కారు విభాగాల కంపెనీ… మధ్యాహ్నం లంచ్ టైం… ఓ కాస్తంత ఉప్పుంటే ఇస్తారా అని ఓ వర్కర్ అడిగాడు. ఇంకో వర్కర్ వేరే టేబుల్ మీదున్న ఉప్పడబ్బా ఇచ్చాడు. అంతే కరోనాను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక్కడ నుంచి మొదలైంది జర్మనీలో కరోనా విలయం.  కరోనా కేసులు బైటపడగానే జర్మనీ అసలు మూలం ఏంటో తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది.ఈ ఉప్పుడబ్బా నుంచి మొదలైందని తెలుసుకుంది.

వర్కర్లు కలసి పనిచేస్తారు. ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకే కరోనా కట్టడి చాలా కష్టం. అందుకే బైట, మనుషుల నుంచి మనుషులకు COVID-19 ఎలా వ్యాపించిందో జర్మనీ క్రమ పద్ధతిలో తెలుసుకుంది. అర్ధం చేసుకుంది.  

ఇది జరిగింది జర్మనీ పట్టణం Stockdorfలో.  మ్యూనిచ్ కు దగ్గర. కార్ల పార్ట్స్ విడిభాగాలను తయారుచేసే Webasto Groupలో పనిచేస్తున్నారు. అందులో పనిచేసే ఓ చైనా అమ్మాయి, వైరస్ ను Webasto Group హెడ్ క్వార్టర్స్ కు తీసుకొచ్చింది. అక్కడ నుంచి తొటివారికి అంటించింది. అందులో మొదటి వ్యక్తి… ఆమెను సాల్ట్ ను అడిగిన వర్కర్. సైంటిస్ట్ లు ఇక్కడ నుంచి ఎవరు ఎవరిని కలిశారో ట్రాక్ చేసుకొంటూ….కరోనా వచ్చిన, రావడానికి అవకాశమున్న అందరినీ కనిపెట్టింది. వాళ్లందరినీ టెస్ట్ చేసింది.

జనవరి22న ఆ కేంటీన్ సీన్ నుంచి ప్రతి ఒక్కరినీ కనిపెట్టడానికి చైనా వైద్యవేట మొదలెట్టింది. ప్రతి ఒక్కరినీ ఐసోలేటే చేసింది. Bavaria ప్రభుత్వం ఏ ఒక్కరూ రాష్ట్రం విడిచిపోకుండా కట్టుదిట్టంగా పనిచేసింది… కరోనాను కట్టడిచేసింది.జర్మనీ కరోనాకు రక్షణ ఛత్రాన్ని తయారుచేయడంలో ఈ వైద్యవేట బాగా పనికొచ్చింది.

తొలిసారి కరోనా వచ్చినవారిని నుంచి ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేసిన జర్మనీ, వేలాది ప్రాణాలను రక్షించిందని అంటున్నారు. ఇటలీకన్నా ముందుగానే జర్మనీలో కరోనా వచ్చింది. అయినా తక్కువ ప్రాణనష్టం. అదే ఇటలీలో ఫిబ్రవరి 21న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటికే జర్మనీ కరోనాను కట్టడిచేసింది. ఎలా చేసిందోకూడా ప్రపంచానికి చెప్పింది. జర్మనీలో ఇంతవరకు 2,100 మందిచనిపోతే, ఆ తర్వాత కరోనా వచ్చిన ఇటలీలో  మరణాలు 18వేల వరకు ఉన్నాయి.