అప్పుడు ఇండియా ఔట్ నినాదం, ఇప్పుడు కాళ్ల బేరం..! మాల్దీవులకు భారత్ విలువ తెలిసిందా?

గాయం చేసే వాడి కోసం సాయం చేసే వాడిని పక్కన పెట్టినట్లైంది మాల్దీవుల పరిస్థితి.

అప్పుడు ఇండియా ఔట్ నినాదం, ఇప్పుడు కాళ్ల బేరం..! మాల్దీవులకు భారత్ విలువ తెలిసిందా?

Updated On : October 7, 2024 / 11:18 PM IST

Maldives President Muizzu India Tour : చైనా మాయలో పడి ఇండియా ఔట్ అన్నారు. తామే ఔట్ అయిపోతామనే భయంతో చివరికి ఇప్పుడు ఇండియా సాయం కోసం చేతులు చాచారు. మాల్దీవుల అధ్యక్షుడు భారత్ లో పర్యటించన వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైనా అండతో మనల్ని చిన్నగా చూసిన మయిజ్జు కళ్లు ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూశాయి. సాయం చేయండని అర్ధించాయి. మాల్దీవుల అధ్యక్షుడి తీరుకు కారణం ఏంటి? ఉన్నట్టుండి కాళ్ల బేరానికి ఎందుకు వచ్చినట్లు?

గాయం చేసే వాడి కోసం సాయం చేసే వాడిని పక్కన పెట్టినట్లైంది మాల్దీవుల పరిస్థితి. ఆ దేశానికి ఇప్పటికైనా భారత్ గొప్పదనం తెలిసిందా? మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఇంతలా దిగజారడానికి అసలు కారణాలు ఏంటి? మాల్దీవులు, భారత్ సంబంధాలు ఇక మెరుగుపడినట్లేనా? చైనా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది. మాల్దీవులతో మైత్రి మనకు ఎలా కలిసి రాబోతోంది?

హిందూ మహా సముద్రంలో 1200 పగడపు దీవుల సమూహమే మాల్దీవులు. ఈ ద్వీప దేశం జనాభా 5 లక్షల 20వేలు. మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రుల రియాక్షన్ తో సోషల్ మీడియాలో యుద్ధమే జరిగింది. ఇండియా నుంచి టూరిస్టుల సంఖ్య 50వేలకు పైగా తగ్గిపోయింది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపించింది. ఇక అటు ఆహారం, మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం భారత్ మీద ఆధారపడుతోంది. మయిజ్జు భారత పర్యటన అజెండాలో ఆర్థిక ప్యాకేజీ అంశం ఉందన్న విషయాన్ని రెండు ప్రభుత్వాలు కన్ ఫర్మ్ చేయకపోయినా.. మోదీతో మయిజ్జు చర్చల్లో ఇది భాగం కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం పొందడమే మయిజ్జు టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మాల్దీవుల్లో విదేశీ మారక ద్రవ్యం భారీగా తగ్గింది. 440 మిలియన్ డాలర్లకు పడిపోయింది. క్షీణించిన విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు.. మాల్దీవ్స్ సెంట్రల్ బ్యాంక్ 400 మిలియన్ డాలర్ల మార్పిడి ఒప్పందం కోసం ఎదురు చూస్తోంది.

 

Also Read : పేలుతున్న బాంబులు, గాల్లో ప్రాణాలు..! ఈ యుద్ధం ఆగేదెలా? పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది?