‘ఆటిజం’చిన్నారులకు స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పుతున్న ‘పక్షి రోబో’

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 07:19 AM IST
‘ఆటిజం’చిన్నారులకు స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పుతున్న ‘పక్షి రోబో’

Updated On : March 5, 2020 / 7:19 AM IST

‘ఆటిజం’చిన్నారులకు శాపం. తల్లిదండ్రులకు తీరని మానసిక వేదన. ‘ఆటిజం’బాధిత పిల్లలు అమాయకంగా.. తమదైన లోకంలో కాలం గడిపేస్తుంటారు. చిన్నారులకు ‘ఆటిజం’ ఉందని కనిపెట్టటం కూడా చాలా కష్టం. ‘ఆటిజం’ ఒక్కో చిన్నారిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది మైల్డ్ గా ఉండిపోతే..మరికొంతమంది హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. వాళ్లకు కట్టడి చేయటం చాలా కష్టం. అసలు ‘ఆటిజం’ అంటే మానసిక రుగ్మత అని కూడా తెలియదు చాలామందికి. ‘ఆటిజం’ ఉందని కనిపెట్టి వారిని నిరంతరం సాకుతూ..వారిని సాధారణంగా ఉంచటం కత్తిమీద సాములాంటిదే.

ఏదైన ఓ విషయం నేర్పాలన్నా..సాధారంగా రోజువారీ చేసుకునే పనుల గురించి ‘ఆటిజం’  పిల్లలు అర్థం అయ్యేలా చెప్పాలంటే మామూలు విషయం కాదు. కానీ ‘ఆటిజం’ బాధిత చిన్నారుల కోసం ఓ బుల్లి రోబో వచ్చింది. ఆ రోబో ఓ పక్షి ఆకారంలో ఉంటుంది. దీంతో పిల్లలు దీన్ని చూడటానికి ఒకదగ్గర కుదురుగా ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాదు..‘ఆటిజం’ చిన్నారులకు ఈ పక్షి రోబో చక్కటి ఫ్రెండ్ లా ఉంటుంది. 

‘ఆటిజం’ చిన్నారులకు స్నేహితుడిలా సలహాలిస్తూ, గురువులా పాఠాలు నేర్పే సరికొత్త పక్షి రోబోను అమెరికాలోని సౌతెర్న్‌ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దానికి ‘కివి’ అని పేరు కూడా పెట్టారు. ఇది చూడటానికి అచ్చం పక్షిలా రెక్కలు, ముక్కు, ఈకలు, తల కలిగి ఉంటుంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనంలో భాగంగా 17 మంది ఆటిజం బాధిత పిల్లలు ఉండే ఇళ్లలో కివి రోబోలను ఉంచారు. వాటికి అనుసంధానమై ఉండే ట్యాబ్‌లలో పిల్లలతో చిన్న చిన్న లెక్కలను చేసే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో ఆ చిన్నారులు ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నప్పుడు ‘కివి’ వారికి చక్కటి సలహాలిస్తుంది.  సూచనలిస్తూ లెక్కలు చక్కగా చేసి..వాటికి ఆన్సర్ వచ్చేలా చేస్తుంది. ఆన్సర్ వచ్చేలా ఎలా చేయాలో చక్కటి సూచనలిస్తుంది. ఆ దిశగా ‘కివి’ ఆటిజం చిన్నారులకు సహాయంగా పనిచేస్తోంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేలా చేసిన తరువాత వారిని ఎంకరేజ్ చేస్తూ..‘గుడ్‌ జాబ్‌’ మై డియర్ ఫ్రెండ్ అంటూ ప్రశంసిస్తుంది.

దీంతో ఆ చిన్నారులు మేం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ వారిలో వచ్చేలా చేయటంలో కివి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కివితో సమాచార మార్పిడి ద్వారా ఆటిజం బాధిత బాలల్లో సామాజిక నైపుణ్యాలు కూడా పెరిగాయి. దీంతో తాము రూపొందించి కివి ఆటిజం  పిల్లలకు చక్కగా ఉపయోగపడుతోందని వెల్లడించారు.

See Also | Fact Check : వైరల్ అవుతున్న ఈ SBL Arsenic Album-30 ఔషధం కరోనా‌వైరస్‌ నుంచి రక్షించగలదా!