Afghanistan Crisis : జనసంద్రమైన కాబూల్ విమానాశ్రయం
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో సహా దేశమంతా తాలిబన్ల వశం కావటంతో ఆదేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబన్ల గత చరిత్రను తలుచుకుని వణికిపోయారు.

Afghan Cricis 1
Afghanistan Crisis : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో సహా దేశమంతా తాలిబన్ల వశం కావటంతో ఆదేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబన్ల గత చరిత్రను తలుచుకుని వణికిపోయారు. బతికుంటే బలుసాకు తినొచ్చు అన్నంతగా ఎంత త్వరగా దేశం విడిచి పారిపోతే అంత మంచిదని విదేశాలకు వెళ్లిపోయేందుకు విమానాశ్రయానికి పరుగులు పెట్టారు.

కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆఫ్గానిస్తానీయులు
ఈక్రమంలో ప్రపంచ దేశాలు కలత చెందే దృశ్యాలెన్నో వెలుగు చూశాయి. ఇండియాలో జనరల్ రైలు బోగీని తలపించేలా కిక్కిరిసిన విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు.

ఈ విమానంలో 640 మంది ఇరుక్కుని కూర్చుని విదేశాలకు వెళ్ళిపోయారు
పల్లెటూరి ఎర్ర బస్సు ఎక్కటానికి వెంటపడే గ్రామీణుల్లా విమానం వెళ్తుంటే దాని వెంట పడిన ప్రజలను చూశారు.

విమానాశ్రయం రన్‌వే పైకి వచ్చిన వందలాది మంది ఆఫ్గాన్ పౌరులు
విమానం రెక్కలపై తాళ్లతో కట్టుకుని గాల్లోకి ఎగిరాక ఆకాశంలోంచి జారిపడిన ముగ్గురు ప్రయాణికులను చూస్తే గుండె బరువెక్కిపోయింది.

తాలిబన్ల పాలన నుంచి తప్పించుకుని వేరేదేశంలో తలదాచుకునేందుకు ప్రయత్నాలు
ఆఫ్ఘాన్ నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క ఆధారం విమాన ప్రయాణమే. దాంతో ఆ దేశప్రజలంతా కాబూల్ విమానాశ్రయం వైపు బారులు తీరారు. విమానాశ్రయానికి వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి.

కాబూల్ విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జాం
విమానాశ్రయానికి వెళ్లే దారులు ఆదివారంనుంచి ఆదేశ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు సాక్ష్యంగా నిలిచాయి. ఆప్ఘనిస్తాన్ లోని వాస్తవ పరిస్ధితిని శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన మాక్సర్ టెక్నాలజీస్ అనే సంస్ధ తీసిన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.