ఇస్లాం పవిత్రనగరం మక్కాలో కరోనా: కఠిన చర్యలకు సిద్ధమైన సౌదీ ప్రభుత్వం

ఇస్లాం పవిత్రనగరం మక్కాలో కరోనా: కఠిన చర్యలకు సిద్ధమైన సౌదీ ప్రభుత్వం

Updated On : April 14, 2020 / 7:52 AM IST

కరోనా మహమ్మారి ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా నుంచి తరిమేసేందుకు సౌదీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. అక్కడి మురికివాడలు, కార్మికుల క్యాంపులు కారణంగా 24గంటల కర్ఫ్యూ సమయంలోనూ కరోనా విపరీతంగా ప్రబలింది. 2మిలియన్ మంది ఉన్న మక్కాలో సోమవారం నాటికి 1050కరోనా కేసులు నమోదయ్యాయి. మక్కా కంటే మూడు రెట్లు పెద్దదైన దేశ రాజధానిలో 1422మంది నమోదు అయ్యాయి. మక్కాలో వలస కార్మికులు, పనివారు ఉండటంతో వ్యాప్తిని అడ్డుకోవడం కష్టంగా మారుతుంది. 

మార్చి నెలాఖరులో మక్కాకు చెందిన సౌదీ బిన్ లాడెన్ గ్రూపులోని అయిదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పనిని అక్కడితో ఆపేసి 8వేల మంది కార్మికులను ఇంటికే పరిమితం చేశారు. ఇస్లాం పవిత్ర స్థలంలోని మక్కా మసీదు విస్తరణ పనులు నిలిచిపోయాయి. కొందరు కార్మికులను ఓ హోటల్ కు క్వారంటైన్ కు పంపారు. అమెరికా, ఇటలీల  మాదిరిగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సౌదీ అరేబియాకు కూడా కష్టంగానే మారుతుంది. (లాక్ డౌన్ గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం)

ఇస్లాం పుట్టిన ప్రదేశం కావడం, నగరం యొక్క ప్రత్యేకత, రాచ కుటుంబాలను నియంత్రించలేకపోవడం, మిలియన్ల కొద్దీ ముస్లిం తీర్థయాత్రికులను పర్యటిస్తుండటం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకుని ఆ ప్రదేశాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.

30మిలియన్ జనాభా ఉన్న సౌదీ అరేబియాలో 5వేల కేసులు నమోదయ్యాయి. మక్కాలో మాత్రమే పూర్తి రోజు కర్ఫ్యూ విధించారు. జాగ్రత్తల్లో భాగంగా ఫిబ్రవరి నుంచే మతపరమైన యాత్రికులను నగరంలోకి రాకుండా ఆపేశారు. విదేశీయుల కారణంగా వచ్చిన కరోనా కేసులు.. దాదాపు 70 నుంచి 80శాతం మందికి వచ్చే సూచనలు ఉన్నాయని ఆరోగ్య శాఖ చెప్తుంది. 

కొందరు సౌదీ దేశస్థులు విదేశీయులపై దాడి కూడా జరిపారు. వారి కారణంగానే వైరస్ వ్యాప్తి జరుగుతుందని, ధరలు పెరుగుతున్నాయని, భయంతో చస్తున్నామని ఆరోపించారు. అక్కడ జీవన పరిస్థితులు మెరగవుతేనే దీనిని అడ్డుకోగలమని, చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని నిపుణులు అంటుననారు. సౌదీ నవలా రచయిత మొహమ్మద్ అల్వాన్ కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్లో ఈ మహమ్మారి ప్రభావం తర్వాత ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కట్టించాలి. 

ఆరోగ్య శాఖ మంత్రి తౌఫిక్ అల్ రభియా ఈ సమస్య టెలివిజన్లలో టెలికాస్ట్ అయింది. దీనిపై గవర్నమెంట్ కమిటీ వేసి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు.  దీంతో పాటు విదేశీయులకు ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తామని అక్రమంగా వచ్చిన వలస కార్మికులకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేసింది గవర్నమెంట్.