కరోనా గురించి పీడకలలొస్తున్నాయా? కారు కంట్రోల్ తప్పడం, సునామీలు, స్నేక్స్. ఏంటి ఈ కలలకు అర్ధాలు?

మీరు కారులో వెళ్తున్నారు. బ్రేక్ వేద్దామంటే కుదరడంలేదు. కాళ్లాడటంలేదు. ఇంకోసారి, మీరు వరండాలో నిల్చున్నారు. గోడలు దగ్గరగా వస్తున్నాయి….ఇరుకైపోతోంది… ఏం చేయాలి? ఇంకోసారి, పెద్ద సునామీ అల మీదకు దూసుకొస్తోంది. తాటిచెట్టంత పెద్దది. పారిపోలేరు… మీరు పడుకున్నారు…గదిలో పెద్ద పాము… అరుద్దామంటే…నోరు పెగలడంలేదు… చెమట్లు పడుతున్నాయి. తుళ్లిపడి… నిద్రలోంచి లేచారు.
ఇలాంటి పీడకలలు మాకు వస్తున్నాయి. నిద్రపట్టడంలేదు. మనసులో ఏదో అలజడి. ఏం చేయాలంటూ సైక్రియాటిస్ట్‌లకు ప్రపంచవ్యాప్తంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కొందరికి కలల్లో అర్ధాలు కనిపిస్తుంటే, మరికొందరికి గందరగోళం. కలలను ఊహించుకొంటేనే వాళ్లకు భయం. ఎందుకు ఈ పీడకలలు? ప్రతిరాత్రి కాళరాత్రి ఎందుకు అవుతోంది? లాక్‌డౌన్ మానసికంగా ఇబ్బంది పెడుతోందా?
ఇద్దరు ఎక్స్ పర్ట్స్ ఈ పీడకలల వెనుకున్న అసలు కథలు, మనసు పొరల్లో దాగున్న భయాలను బైటకు తీస్తున్నారు. కారు కంట్రోల్ తప్పుతోంది. మీరు ఎప్పుడూ ఊహించని వ్యక్తులతో రొమాన్స్ చేస్తున్నారు. ఈ రెండు కలలు ఎక్కువగా వస్తున్నాయంట. జుగుప్సాగా ఉంటోందంట. దీనికి, dream expert Dr,ian wallace, jane Teresa Anderson కలలకు కొత్త అర్ధాన్ని చెప్పారు. ఈ కరోనా టెన్షన్ లో కలలు చాలా స్పష్టంగా మాత్రమేకాదు, ఎక్కువసేపు వస్తున్నాయంట. మనం ఎమోషనల్ అవుతున్నకొద్దీ డ్రీమ్స్ మరింత క్లియర్ గా వస్తున్నాయి. ప్రతిదీ గుర్తుంటోంది. డాక్టర్ వాలెస్ ఉద్దేశంలో…ఇంతకుముందు మనకు కలలొచ్చినా, మెలుకవ వచ్చేసరికే మర్చిపోతాం. Dreaming activity ఆగిపోతోంది. ఎప్పుడైతే మనం కలగంటూ నిద్రలేస్తున్నామంటే అది sleeping cycleలో నాలుగో స్టేజ్. వీటిని త్వరగా మర్చిపోలేం.
కార్ కంట్రోల్ తప్పుతోంది
ఈ డ్రీమ్ మినింగ్ ఒక్కటే. మీరు మారుతున్న ప్రపంచాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పీడకల ఎందుకు ఎక్కువగా వస్తోందంటే, చాలామందికి బతుకుమీద అనిశ్చితి. ఇదే కలరూపంలో వెంటాడుతోంది.
పెద్ద సునామీ మీమీద విరుచుకుపడుతోంది….తప్పించుకోలేరు
పెద్ద అల వస్తోందన్న కల ఎక్కువమందికి వస్తోంది. అంటే, ఉపద్రవం గురించి మనం వింటున్నాం. అమెరికాలాంటి దేశమే అల్లల్లాడిపోతోదంటే, మనం తప్పించుకోగలమా? అన్న భయమే సునామీరూపుదాల్చి పీడకలగా వస్తోంది.
మీ ఫోన్ పోయింది
ఫోన్ పోయిందంటే అందరూ భయపడతాం. కొందరికైతే పళ్లుకూడా రాలిపోతున్నట్లు కలలొస్తున్నాయంట. దీనర్ధమేంటి? ఫోన్ మీ ఐడెంటిటీ. దాన్ని మీరు కోల్పోతున్నారన్న భయం కలరూపంలో వస్తోంది. మీకు జాబ్ పోతే, మీ వ్యక్తిత్వం, గౌరవం అన్నీపోతాయి. ఆ భయమే..కలలో మీరు ఎక్కువగా వాడే ఫోన్ రూపంలో భయపెడుతోంది.
చీకట్లో ముఖంలేని దెయ్యం వెంటాడుతోంది.
మీరు పరిగెడుతున్నారు…పరిగెడుతున్నారు..తప్పించుకోలేకపోతున్నారు. దగ్గర నుంచి చూద్దామంటే….ముఖం కనిపించడంలేదు. న్యూయార్క్, సింగపూర్, ముంబై నగరాల్లో ఇలాంటి భయంకరమైన కలలొస్తున్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. కరోనా ఎలా ఉంటుందో తెలియదు. అయినా విలయం. ఈ భయమే రూపంలేదని మృత్యువుగా, పేస్‌లెస్ టెర్రర్‌గా కనిపిస్తోంది.
మీరు ఇరుక్కుపోయారు. ఊపిరాడటంలేదు
మీరు ఎక్కడికే వెళ్లాలనుకొంటారు. ప్రతి అడుగుకు ఓ ఇబ్బంది. ముందుకెళ్లలేకపోతున్నారు. మీరు వరండాలో నడుస్తున్నారు. ఒక్కసారిగా రెండువైపు నుంచి గోడలు దగ్గరకు వస్తేస్తున్నాయి. మిమ్మల్ని క్రష్ చేస్తున్నంత ఫీలింగ్. మీకు ఊపిరి ఆడటంలేదు. ఈ పీడకల బెడ్ దిగిన తర్వాతకూడా వెంటాడుతూనే ఉంటోంది. ఈ కల వస్తోంది…భయంగా ఉందని చాలామంది చెబుతున్నారు.
మీరు ప్రేమించిన వ్యక్తిచనిపోయాడు
మీరు గాఢంగా అభిమానించారు. అతను చావుబతుకుల్లో ఉన్నాడు. అంతే మీకు విషాదం. మెలుకవొచ్చింది. నిజానికి, కరోనా తీవ్రత, మానసికంగా ప్రపంచాన్ని దెబ్బతీసింది. అందుకే మనవాళ్లను మనం కోల్పోతామన్న భయం ఇలాపీడకలగా వస్తోంది. కరోనా భయానికి రూపంలేదు. అలాంటి టెర్రర్ మనమీదకు వస్తోందన్న ఆందోళన ఎక్కువమందిది. అందుకే దగ్గినా, తుమ్మినా…వాళ్లు కలలోకి వస్తున్నారంట.
ఒంటరిగా ఉండటం, లాక్‌డౌన్‌వల్ల నిర్బంధంలో ఉన్నా ఫీలింగ్‌తో.. కలల తీరు మారుతోందని అంటున్నారు సైకాజిస్ట్‌లు. ఏదైనా విపత్తు వచ్చిప్పుడు అందరికీ దాదాపు ఒకేలా పీడకలలు వస్తాయి. ఇది సాధారణమే. కొందరు నెమ్మదిగా మాములుగా స్థితికొస్తారు. మరికొందరికి మాత్రం ఈ పీడకలలు నెలలు, సంవత్సరాలు వెంటాడతాయి.
Also Read | అంత్యక్రియలు అడ్డుకున్న 60మంది పై కేసు నమోదు