అమెరికాలో లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా? ఫెడరల్ ఉద్యోగులకు ఇక కాళరాత్రులేనా?
ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన ట్రంప్.. ఇక ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు.

DOGE : అనుకున్నదే జరిగింది. అయితే జరగబోయేది తలుచుకోవడానికే భయంగా ఉంది. అమెరికాలో నడుస్తున్న టాక్ ఇదే. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్న్ మెంట్ ఎఫీషియన్సీ.. సింపుల్ గా D.O.G.E. ప్రాజెక్ట్ . ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఇది. అనుకున్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను మస్క్ కి అప్పగించారు ట్రంప్. మరిప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు? ఉద్యోగులకు ఇక పీడ కలే అని మస్క్ ఎందుకు అంటున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ DOGE ఏంటి? దాని టార్గెట్ ఏంటి? లక్షల ఉద్యోగాలు ఇక హుష్ కాకేనా?
అమెరికా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా గెలిచిన వారందరికి తగిన పదవులు కేటాయిస్తున్నట్లు దాదాపుగా ప్రతి రోజు ఆయన నుంచి ఓ ప్రకటన వినిపిస్తోంది. ట్రంప్ విజయం కోసం అందరికంటే ఎక్కువ కష్ట పడింది మస్కే. 120 మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడమే కాదు వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ట్రంప్ కోసం ప్రచారాలు నిర్వహించారు మస్క్. ట్రంప్ గెలిచారు అంటే ఓ రకంగా ఆ క్రెడిట్ అంతా మస్క్ కే ఇవ్వాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. మస్క్ తో పాటు మరో వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామికి ప్రాజెక్ట్ DOGE అంటే డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రచారం నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ట్రంప్ విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మస్క్ చేతికి అప్పగించారు. ఇది ఫెడరల్ ప్రభుత్వం చరిత్రలోనే సరికొత్త శకంగా మారబోతోందని రిపబ్లికన్ పార్టీ నేతలు అంటున్నారు.
ప్రాజెక్ట్ డోజ్ అనేది ఫెడరల్ ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం. ఈ కొత్త డిపార్ట్ మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం వరకు అంటే.. జూలై 4 2026 వరకు ప్రభుత్వం చేయాల్సిన మార్పులు, ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై డోజ్ ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని, అమెరికా జనాలకు 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి తమ ప్రభుత్వం ఇచ్చే కానుక అని ట్రంప్ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని, అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచాలని ట్రంప్ ఆశిస్తున్నారు.
ఫెడరల్ ఉద్యోగుల తీరు మీద ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు. అమెరికా జనాల సొమ్ము వృథా అవుతోందని ఆరోపించారు. ఇక, ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన ట్రంప్.. ఇక ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో లక్షల ఉద్యోగాలు హుష్ కాకీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే చర్చలు జరుగుతున్నాయి. డోజ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు అమెరికా విదేశాంగ విధానాల్లోనూ మస్క్ కీలక పాత్ర పోషించడం ఖాయమని పుతిన్ మీద చేసిన కామెంట్లే ఎగ్జాంపుల్ అనిపిస్తున్నాయి.
ఖర్చులు తగ్గించడం, తక్కువ ఖర్చుతో పనలు కానిచ్చేయడం మస్క్ తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే తాత్కాలికంగా కొన్ని కష్టాలు తప్పవంటూ మస్క్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ రీసౌండ్ ఇస్తున్నాయి. ఖర్చు ఎక్కువ అనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసే మస్క్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? లక్షల ఉద్యోగాలు ఇక గాల్లో కలిసినట్లేనా? విదేశాంగ విధానాల్లోనూ మస్క్ వేలు పెట్టబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చెబుతున్నదేంటి?
Also Read : ఖలీస్తానీలు హిందూ ఆలయాలనే ఎందుకు టార్గెట్ చేశారు?