అనుమానం రాకుండా, అంతుచిక్కకుండా ఆపరేషన్స్.. కట్టప్పలతో శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇజ్రాయెల్..
కోవర్ట్ ఆపరేషన్ అయినా, డైరెక్ట్ అటాక్ అయినా, సొరంగంలో దాక్కున్నా.. ఒక్కొక్క శత్రువును పొగ పెట్టి మరీ బయటకు తీసి ఖతం చేసేస్తోంది.

Israel Covert Operations : యుద్ధమే ఆ దేశం ఊపిరి. పోరులోనే పుట్టి పోరాటంతోనే ఎదిగింది. యుద్ధమే ఊపిరై అస్తిత్వతమే అజెండాగా.. చుట్టూ శత్రువులు ఉన్నా.. తగ్గకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్. చిక్కదు, దొరకదు, ఊహకు అందదు అన్నట్లుగా రఫ్ ఆడించేస్తోంది. నీ పక్కనే ఉంటా, నువ్వు ఉన్న దగ్గరకు వస్తా, నీడలా వెంటాడతా, నీళ్లు తాగాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తా అన్నట్లుగా అపరేషన్స్ చేస్తోంది. ఎలా అయితే అలా అయ్యింది.. అంతమే పంతం అంటోంది ఇజ్రాయెల్.
దెబ్బ మీద దెబ్బ కొట్టి పాలస్తీనా మీద పట్టు సాధించింది. హమాస్ ను ఆగం చేసింది. హెజ్ బొల్లాకు ఇచ్చి పడేసింది. లెబనాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇరాన్ కు వణుకు పుట్టిస్తోంది ఇజ్రాయెల్. బరి గీసి కొట్లాడేందుకైనా.. వైమానిక దాడులైనా.. కోవర్టు ఆపరేషన్లలో అయినా.. అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వస్తోంది ఇజ్రాయెల్. కట్టప్పలతో ఇజ్రాయెల్ శత్రువు దేశాల అంతు చూస్తోందా? ఊహకు అందకుండా ఎలా ఆపరేషన్స్ చేయగలుగుతోంది?
గెలవాలనే తపన.. శత్రువు అంతు చూడాలనే కసి.. యుద్ధ భూమి నుంచి విజయంతోనే వెనుదిరగాలనే పట్టుదల. ఇదే వ్యూహ రచనతో వచ్చినోళ్లకు వచ్చినట్లు ఇచ్చిపడేస్తోంది ఇజ్రాయెల్. ఏం చేస్తుందో తెలియదు, ఎలా మట్టుబెడుతుందో అంతు చిక్కదు. కొడితే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఇజ్రాయెల్ ఆపరేషన్ అంటే అట్లుంటది.
కోవర్ట్ ఆపరేషన్ అయినా, డైరెక్ట్ అటాక్ అయినా, సొరంగంలో దాక్కున్నా.. ఒక్కొక్క శత్రువును పొగ పెట్టి మరీ బయటకు తీసి ఖతం చేసేస్తోంది. హమాస్ నుంచి హెజ్ బొల్లా లీడర్ల వరకు.. గాజా నుంచి ఇరాన్ వరకు.. ఎనిమీ ఎవరన్నది లెక్క చేయడం లేదు. సీక్రెట్ ఏజెంట్లతో, కోవర్టులతో విదేశీ గడ్డ మీద ఆపరేషన్స్ చేస్తోంది. సీక్రెట్ కిల్లర్స్ ఎలా పని చేస్తారు? ఆ ఐదు సంస్థలతోనే శత్రువుల నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుకుంటుందా?
జనాభా పరంగా చిన్న దేశమే అయినా.. ఆయుధ సంపత్తి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్మ్స్ పరంగా చాలా స్ట్రాంగ్. అందుకే తమ దేశానికి చిన్న హాని కలిగినా.. ఎక్కడా తగ్గదు. గాజా మీద దాడులు మొదలు.. ఇప్పుడు ఇరాన్ వరకు శత్రు దేశాలు, మిలిటెంట్ల అంతు చూస్తూ వస్తోంది. పాలస్తీనా, గాజా, హమాస్, ఇరాన్, లెబనాన్, హిజ్ బొల్లా.. ఇలా అందరినీ మడత పెట్టేస్తోంది. తమ వరకు వస్తే ఏ విషయంలోనూ తగ్గదేలే అంటోంది ఇజ్రాయెల్. శత్రువుల మీద పైచేయి సాధించామా లేదా అన్నట్లుగానే యుద్ధం చేస్తోంది. కోవర్టు ఆపరేషన్లతో హడలెత్తిస్తోంది. ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి మీద అటాక్ చేయబోతోందో అనేది అంతు చిక్కకుండా.. శత్రువును భస్మం చేసేస్తుంది.
Also Read : టెన్షన్ టెన్షన్.. అణు యుద్ధానికి సిద్ధం అంటున్న రష్యా..! నెక్ట్స్ ఏం జరగబోతోంది?