Sri Lanka : శ్రీలంకలో ఎల్టీటీ దాడులు చేసే అవకాశముందని భారత్ వార్నింగ్..అప్రమత్తమైన లంక సర్కార్

ఎల్టీటీఈ ఉగ్రవాదులు మళ్లీ సంఘటితమై శ్రీలంకలో దాడులు చేయడానికి సిద్ధమయ్యారన్న భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలను ఆ దేశం తోసిపుచ్చింది. అయినా..భారత మీడియాలో వచ్చిన కథనాలపై దర్యాప్తు చేస్తున్నామని శ్రీలంక ప్రకటించింది. తమకు ఇంటెలెజిన్స్ నుంచి అలాంటి హెచ్చరికలు ఏమీ రాలేదని తెలిపింది. దేశమంతా భద్రత పెంచామని తెలిపింది.

Sri Lanka : శ్రీలంకలో ఎల్టీటీ దాడులు చేసే అవకాశముందని భారత్ వార్నింగ్..అప్రమత్తమైన లంక సర్కార్

Sri Lanka Denies Indian Intel Claims Of ‘ltte

Updated On : May 16, 2022 / 11:16 AM IST

Sri Lanka denies Indian intel claims of ‘LTTE : శ్రీలంకలో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని రణిల్ విక్రమ్ సింగే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వంలో చేరేందుకు ప్రతిపక్షాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కానీ..ఆయనతో బయటినుంచి కలిసి పనిచేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. అటు ఎల్టీటీఈ ఉగ్రవాదులు మళ్లీ సంఘటితమై శ్రీలంకలో దాడులు చేయడానికి సిద్ధమయ్యారన్న భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలను ఆ దేశం తోసిపుచ్చింది.

శ్రీలంకలో దశాబ్దాల అంతర్యుద్ధం 2009లో ముగిసింది. ఎల్టీటీఈని అణిచివేసింది ఆ దేశ ప్రభుత్వం. ఆ తర్వాత దేశంలో ఎక్కడా ఎల్టీటీఈ పేరు వినిపించలేదు. ఇప్పుడు దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ తమిళ ఉగ్రవాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏటా మే 18ని శ్రీలంక తమిళులు ముల్లివైక్కాల్ యానివర్శిరిగా జరుపుకుంటారు. అంతర్యుద్ధంలో అసువులు బాసిన తమిళులకు నివాళులర్పిస్తారు. మే 18న శ్రీలంకలో ఎల్టీటీఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని భారత ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉన్న తమిళ ఉగ్రవాదులు..శ్రీలంకలో విధ్వంస రచనే లక్ష్యంగా తమిళనాడులో ప్రవేశించారని తెలిపింది. భారత మీడియాలో వచ్చిన కథనాలపై దర్యాప్తు చేస్తున్నామని శ్రీలంక ప్రకటించింది. తమకు ఇంటెలెజిన్స్ నుంచి అలాంటి హెచ్చరికలు ఏమీ రాలేదని తెలిపింది. దేశమంతా భద్రత పెంచామని తెలిపింది.

అటు రాజపక్సే రాజీనామా తర్వాత చెలరేగిన ఆందోళనలు సద్దుమణగడంతో…శ్రీలంకలో ఇప్పుడిప్పడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బుద్ధుని పండుగ సందర్భంగా లంకలో కర్ఫ్యూ ఎత్తివేశారు. అయితే రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. మహింద రాజపక్సను అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. మహింద దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించడంతో… ఏ క్షణమైనా ఆయన అరెస్టు తప్పదని భావిస్తన్నారు. అటు ఏప్రిల్ 9 నుంచి జరుగుతున్న గొటా గో హోం ఉద్యమ డిమాండ్‌ను పరిశీలించేందుకు ప్యానెల్ ఏర్పాటుచేస్తున్నట్టు రణిల్ విక్రమ్‌సింఘే ప్రకటించారు.

క్యాబినెట్ ఏర్పాటు ప్రక్రియను రణిల్ వేగవంతం చేశారు. నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రణిల్ ప్రభుత్వంలో చేరేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావడం లేదు. అయితే దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రణిల్‌తో కలిసి పనిచేసేందుకు అంగీకరించాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షోభం పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రణిల్ హామీ ఇచ్చారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో ఆర్థికమంత్రి పదవి ఎవరు చేపడతారన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. అప్పులు, ఆర్థిక సాయాల కోసం ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధితో పాటు అనేక దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది కొత్త ఆర్థికమంత్రి. దేశాన్ని ఆర్థికసంక్షోభం నుంచి బయటపడేసే బృహత్తర బాధ్యత కొత్త ఆర్థికమంత్రిపైనే ఉంది. లంకలో ఆందోళనలు చెలరేగిన తొలివారంలోనే పాత ఆర్థికమంత్రిని తొలగించి అలీసబ్రేను ఆర్థికమంత్రిగా నియమించారు అధ్యక్షుడు గొటబయ. అయితే ప్రధానిగా మహింద రాజపక్స రాజీనామాతో క్యాబినెట్ రద్దయిపోయింది. ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతుడిగా పేరున్న అలీసబ్రేకే మళ్లీ ఆర్థికమంత్రి పదవి కట్టబెడతారా కొత వ్యక్తిని నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీలంకకు రెండేళ్ల సమయం పడుతుందని ఇప్పటికే అలీ సబ్రే ప్రకటించారు.
అటు లంకకు భారత్ సాయం కొనసాగుతోంది. 65వేల మెట్రిక్ టన్నుల యూరియా లంకకు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

నెలన్నరరోజులుగా శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభానికి దారితీసింది. శ్రీలంక సకల కష్టాలకు రాజపక్స కుటుంబమే కారణమని ఆరోపిస్తూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలకు దిగారు. నెలన్నర రోజులపాటు శాంతియుతంగా జరిగిన నిరసనల్లో మహీంద రాజీనామా తర్వాత హింస తలెత్తింది. ఆయన అనుకూలురుకు, వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఎంపీ సహా 9 మంది మరణించారు. దాదాపు 250 మంది గాయపడ్డారు.