Afghan : ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు బిజీ..జిహాదీలకు ప్రభుత్వంలో ప్రయారిటీ
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సంసిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.

Taliban Co Founder In Kabul To Hammer Out Govt
Taliban co founder in Kabul to hammer out govt : ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సంసిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విధివిధానాలు, మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే రీతిలో ఈ మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగ అధిపతి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కాబూల్ కు శనివారం (ఆగస్టు 21,2021) వచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పనిలో ముల్లా అబ్దుల్ బిజీబిజీగా ఉన్నారు. కొన్నాళ్లుగా కతార్ లో తల దాచుకున్న ముల్లా అబ్దుల్ ఘనీ అఫ్గాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి శనివారం కాబూల్ చేరుకుని పలువురితో చర్చలు జరుపుతు బిజీ బిజీగా గుడుపుతున్నారు.
ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆఫ్ఘన్ పునర్నిర్మాణ సమాఖ్య చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాతో ఈ విషయాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. తాలిబన్ల ప్రభుత్వంలో జిహాదీలకు స్థానం కల్పించాలని ఇది వరకే నిర్ణయించారు తాలిబన్ నేతలు. ఈ క్రమంలో జీహాదీలతో చర్చలు జరపుతున్నారు. హక్కానీ నెట్‌వర్క్ నేతలు ఖలీల్ హక్కానీ, అనాస్ హక్కానీ, అతడి సోదరుడి కుమారుడైన సిరాజుద్దీన్ హక్కానీ తదితరులతో చర్చలు జరపనున్నారు.
కాగా చైనా చెప్పినట్లుగా అఫ్గాన్ లోని అన్ని జాతులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ముఖ్యనేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలని కర్జాయ్ ప్రతిపాదించారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు.ఇదిలా ఉండగా తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ, బరాదర్‌తో భేటీ కానున్నారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా తాలిబన్లు చర్చలు మొదలుపెట్టారు.
కాగా అమెరికా సేనలు అఫ్గాన్ నుంచి అమెరికా తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అఫ్గాన్ పై తాలిబన్లు పట్టు సాధించారు. 20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను తిరిగి హస్తగతం చేసుకున్నారు.దీంతో దేశాధ్యక్షుడు కూడా పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు మొత్తం దేశాన్నితమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తాలిబన్ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు.ప్రభుత్వ ఏర్పాటులో జీహాదీలను ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు ఈ నెలాఖరు నాటికి పూర్తిగా వైదొలగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే తాలిబన్ల పాలన ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.