Shocking Video: విమానంలో వీరంగం సృష్టించిన పాకిస్థానీ యువకుడు.. కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే..

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. సీట్లను తన్నడంతో పాటు, విమానం కిటికీ అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు.

Shocking Video: విమానంలో వీరంగం సృష్టించిన పాకిస్థానీ యువకుడు.. కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే..

Pakistan young man

Updated On : September 20, 2022 / 8:09 AM IST

Shocking Video: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. సీట్లను తన్నడంతో పాటు, విమానం కిటికీ అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. సదరు వ్యక్తి వికృత చేష్టలతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమాన సిబ్బంది వ్యక్తివద్దకు చేరుకొని అతన్ని అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Cullinan Diamond: ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని వజ్రాలు మావే.. తిరిగిచ్చేయాలంటూ దక్షిణాఫ్రికా డిమాండ్

ఈనెల 14న పెషావర్ నుంచి దుబాయ్‌కు వెళ్లే పీకే-283 విమానంలో యువకుడు ఎక్కాడు. విమానం ఎక్కే సమయంలో మంచిగానే ఉన్న వ్యక్తి విమానం టేకాఫ్ అయిన తర్వాత తనను విమానం నుంచి దింపమని విమాన సిబ్బందిని డిమాండ్ చేశాడు. ఆ తరువాత వీరంగం సృష్టించాడు. సిటును తన్నడంతో పాటు సీట్ల మధ్యలో పడుకొని వికృతంగా ప్రవర్తించాడు. విమానం కిటీకి అద్దాలను కాళ్లతో తన్నాడు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా సరే వినకుండా వీరంగం సృష్టించాడు. వ్యక్తిని శాంతపర్చేందుకు విమాన సిబ్బంది ప్రయత్నిస్తుండటం వీడియోలో చూడొచ్చు.

విమానం దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుడిని ప్రివెంటెవ్ కష్టడీలోకి తీసుకున్నారు. తరువాత పాకిస్థాన్ కు తిరిగి పంపించారు. అయితే సదరు ప్రయాణికుడిని బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు తెలిసింది. మరోవైపు విమానంలో నమాజ్ చేసుకోకుండా అడ్డుకోవడం వల్లే అతడు అలా ప్రవర్తించాడని మరికొందరు చెబుతున్నారు.