Sky full of Aliens: అంతరిక్షమంతా వందల్లో రోదసీ నౌకలు.. ఏలియన్లు అని తెలిసినా చెప్పడం లేదా..

ప్రపంచంలో ఏ మూల నుంచి ప్రయోగం జరిగినా.. ఏ అంతరిక్ష నౌక యుద్ధానికి సిద్ధమైనా అగ్రరాజ్యం అమెరికాకు ఇట్టే తెలిసిపోతుంది. అంతటి స్థాయిలో అమెరికా నిఘా శాటిలైట్లు పనిచేస్తుంటాయి.

Sky full of Aliens: అంతరిక్షమంతా వందల్లో రోదసీ నౌకలు.. ఏలియన్లు అని తెలిసినా చెప్పడం లేదా..

Aliens Looking

Updated On : July 3, 2021 / 8:10 PM IST

Sky full of Aliens: ప్రపంచంలో ఏ మూల నుంచి ప్రయోగం జరిగినా.. ఏ అంతరిక్ష నౌక యుద్ధానికి సిద్ధమైనా అగ్రరాజ్యం అమెరికాకు ఇట్టే తెలిసిపోతుంది. అంతటి స్థాయిలో అమెరికా నిఘా శాటిలైట్లు పనిచేస్తుంటాయి. ఆ దేశ రాడార్ స్టేషన్ల సహాయంతో 2లక్షల ఎయిర్ క్రాఫ్ట్ లు ఒకేసారి ప్రయోగం జరిపినా స్పష్టంగా వాటి వివరాలు చెప్పేయగలదు.

అలాంటిది అంతరిక్షంలో వందల్లో రోదసీ నౌకలు తిరుగుతున్నా.. వాటికి సంబంధించిన వివరాలను యూఎఫ్ఓ అస్సలు చెప్పలేకపోతుంది. దీనిపై కొందరు గాల్లో ఉన్నంత మాత్రాన వాటిని కనిపెట్టలేకపోయామని చెప్పడం కరెక్ట్ కాదు. ఆకాశం చాలా విశాలంగా ఉంటుంది. పక్షులు, మేఘాలు, డ్రోన్లు, ఫైటర్ జెట్స్, ప్లాస్టిక్ బ్యాక్స్ లాంటివి బోలెడు ఉంటాయి. వాటిని కనిపెట్టడానికి సర్వేలెన్స్ అనేది కచ్చితంగా ఉండాలి.

అంతరిక్షంలో తిరిగే రోదసీ నౌకల గురించి తొమ్మిది పేజీల రిపోర్ట్ విడుదల చేసిన డైరక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటిలిజెన్స్.. అవి గుర్తు తెలియని నమూనాల కింద ప్రకటించింది. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గా కనిపిస్తున్నా.. ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇదొక్కటే కాదు. గతంలోనూ 144రిపోర్టులు విడుదల చేసినా స్పష్టత లేదు. ఒక్క సెన్సార్ లో మాత్రం వాటి గురించి కొంచెం రికార్డ్ అయిందని చెప్పినా అదేదో మెకానికల్ సమస్య వల్ల అలా జరిగి ఉండొచ్చని కొట్టిపారేశారు.

ఎక్కడో ఇరానియన్ మిలటరీ చేసే కార్యకలాపాలను ఫోన్ ద్వారా చూసి మానిటర్ చేయగల అమెరికన్ గవర్నమెంట్.. నిజంగా అవి పనికిరాని వస్తువులా.. లేదంటే ఏలియన్ జాడలా అనేది చెప్పలేకపోతుందా..

శాటిలైట్ ఇమేజరీ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి వాతావరణాన్ని చూసే శాటిలైట్స్. వాటి ఇమేజెస్ కాస్త మసకగా అనిపించొచ్చు. రెండోది నిఘా శాటిలైట్లు. అంతరిక్షంలో అరంగుళం పొడవుతో కనిపించే ఏ వస్తువైనా తెలుసుకోగలవు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం అంతరిక్షంలో కనిపించే వస్తువుల గురించి క్లారిటీ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.