Little Girl Protecting Her Siblings : చిట్టి చెల్లెళ్ల కోసం నాలుగేళ్ల చిన్నారి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..
వయస్సు చిన్నదే. కానీ చిట్టి చెల్లెళ్ల కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి చేసిన పనిచూస్తే ఔరా..ఇంత చిన్నవయస్సులోనే చెల్లెళ్ల కాపాడటానికి ఎంత సమయస్పూర్తి చూపించింది అనిపిస్తుంది.

Little Girl Protecting Her Siblings :
Little Girl Protecting Her Siblings : వయస్సు చిన్నదే. కానీ చిట్టి చెల్లెళ్ల కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి చేసిన పనిచూస్తే ఔరా..ఇంత చిన్నవయస్సులోనే చెల్లెళ్ల కాపాడటానికి ఎంత సమయస్పూర్తి చూపించింది అనిపిస్తుంది.తన ఇద్దరు చిట్టి చెల్లెళ్లతో రోడ్డుమీద ఆడుకుంటోంది ఓ పాప. ఆ పాపకు నాలుగేళ్లు ఉంటాయేమో అంతే. అదే సమయంలో ఓ వాహనం వచ్చింది. అంతే అప్రమత్తమైపోయి ఆ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఓరినీ గడుగ్గాయి..ఆ మాత్రం జాగ్రత్త తెలిసిన పిల్లకాబట్టే వారి అమ్మానాన్నలు వారిని వదలి ఎక్కడికో వెళ్లినట్లున్నారు అనిపిస్తోంది.
ఈ వీడియోలు ముగ్గురు చిన్న పాపలు కన్‌స్ట్రక్షన్ సైట్‌లో కనిపిస్తారు. వారి ముందుకు ఓ వాహనం వచ్చింది. అదిచూసిన ఈ ముగ్గురు పిల్లలు పెద్దగా ఉన్న ఓ పాప తన చెల్లెళ్లను కాపాడుకునేందుకు వాహనానికి ఎదురుగా నిలబడి రెండు చేతులు అడ్డంగా చాపుతుంది.ఆపండి ఆపండీ మా చెల్లెళ్లు ఉన్నారు అన్నట్లుగా..
అంతే వాహనం ఆగిపోయింది. ఆ తరువాత ఆ చిన్నపాప ఇద్దరు చెల్లెళ్లను క్షేమంగా ఒకరి తరువాత మరొకరిని ఇంటిలోపలికి తీసుకువెళ్లింది. వారు లోపలికి వెళ్లిన తర్వాత వాహనం వెళ్లిపోతుంది. చిన్నారి సమయస్ఫూర్తికి, తోబుట్టువులను కాపాడుకోవాలనే తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యోగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
చిన్నారి తన సోదరి పాత్రను సీరియస్‌గా పోషించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను లక్షమందిపైనే చూశారు. ఓ యూజర్ ఈ చిన్నారికి నేను బిగ్ హగ్ ఇవ్వాలనుకుంటున్నానని అంటుంటే మరో యూజర్ అద్భుతం..పాపకు నాలుగైదేండ్లు ఉంటాయేమో అని మరో యూజర్ అన్నారు.
Little girl takes her big sister job seriously…??❤️ pic.twitter.com/5fDG2XVJ1g
— ?o̴g̴ (@Yoda4ever) December 14, 2022