ప్రపంచంలో కరోనా మరణాలు చైనాలోనే ఎక్కువ

చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో కన్నా చైనాలోనే ఎక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని… కాకపోతే చైనా ప్రభుత్వం వాటిని రిపోర్ట్ చేయలేదని ట్రంప్ అన్నారు.
చైనాలో వైరస్ మరణాల సంఖ్య తమకు ఎలా తెలుసు అని విలేకరి అడిగినప్పుడు.. ట్రంప్ మాట మార్చారు. ‘ఓ సంస్థ గణాంకాలను నేను చూశాను. కేవలం 6శాతం మాత్రమే కొవిడ్‌తో మరణించారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అని అన్నారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన డేటాను ట్రంప్ ప్రస్తావించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, చైనాలో 4,724 మంది మరణించినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అమెరికాలో 1,84,644 కరోనాతో మృతి చెందారు.