Trump: భారతీయులకు ట్రంప్‌ మరో షాక్‌.. అమెరికా వర్క్‌ స్కీమ్స్‌ కఠినతరం? ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి?

మీరు అమెరికాలో చదువుకుంటూ, పనిచేసుకోవాలని భావిస్తున్నారా?

Trump: భారతీయులకు ట్రంప్‌ మరో షాక్‌.. అమెరికా వర్క్‌ స్కీమ్స్‌ కఠినతరం? ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి?

Donald Trump

Updated On : February 11, 2025 / 6:49 PM IST

ప్రపంచ దేశాలలోని చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలని కలలు కంటుంటారు. అమెరికాలో అమలు అవుతున్న ఆప్షనల్‌ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ) వంటి వర్క్‌ ప్రోగ్రామ్స్‌లు కూడా అందుకు కారణం.

ఎఫ్-1 వీసాలతో అమెరికాకు వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు, వారి విద్య కొనసాగుతున్న సమయంలో, ముగిసిన సమయంలో ఉద్యోగ అనుభవాన్ని పొందటానికి ఓపీటీ, సీపీటీ అనుమతిస్తాయి. 2022-2023 విద్యా సంవత్సరంలో అమెరికాలో దాదాపు 69,000 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో పాల్గొన్నారు.

అయితే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆయా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓపీటీ, సీపీటీ వంటి వర్క్‌ ప్రోగ్రామ్స్‌లలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్‌పై అతి భారీ డిస్కౌంట్‌.. లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్‌.. ఇప్పుడే కొనుక్కోండి..

ఓపీటీ, సీపీటీ అంటే?

  • ఓపీటీ, సీపీటీ అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకును అవకాశాన్ని ఇస్తాయి. చదువుకుంటూనే పనిచేసుకోవచ్చు
  • ఓపీటీ: ఇది గ్రాడ్యుయేషన్‌కు ముందు లేదా తర్వాత లభిస్తుంది. 12 నెలలపాటు ఉద్యోగం చేసుకోవచ్చు
  • ఓపీటీ రెండు రకాలుగా ఈ వర్క్‌ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది
  • ప్రీ-కంప్లీషన్‌ ఓపీటీ: చదువు సమయంలో పార్ట్ టైమ్ వర్క్, విరామ సమయంలో పూర్తి సమయం పని చేసుకోవచ్చు
  • పోస్ట్-కంప్లీషన్‌ ఓపీటీ: గ్రాడ్యుయేషన్ తర్వాత పూర్తి సమయం పని చేసుకోవచ్చు
  • ఎస్‌టీఈఎమ్‌ ఓపీటీ ఎక్స్‌టెన్షన్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్టీఈఎమ్‌) ఫీల్డ్స్‌ల విద్యార్థులు 24 నెలలు ఓపీటీని పొడిగించుకోవచ్చు
  • ఈ ఓపీటీ మొత్తం మొత్తం 36 నెలలు ఉంటుంది

సీపీటీ 

  • స్టూడెంట్స్‌ తమ కోర్సు వర్క్‌లో భాగంగా గ్రాడ్యుయేషన్‌కు ముందు పని చేయడానికి అనుమతి ఉంటుంది
  • ర్రిక్యులమ్‌, అకాడమిక్‌ క్రెడిట్‌ను తప్పనిసరిగా అందించాలి
  • పార్ట్‌టైమ్ పని: వారానికి 20 గంటలు లేదా అంతకంటే తక్కువ లేదా పూర్తి సమయం (వారానికి 20 గంటల కంటే ఎక్కువ) చేసుకోవచ్చు
  • దరఖాస్తు చేయడానికి ముందు ఉద్యోగ ఆఫర్ లెటర్‌ను చూపాలి
  • ఒక విద్యార్థి 12 నెలల కంటే ఎక్కువ పూర్తి సమయం సీపీటీ పూర్తి చేస్తే.. అటువంటి విద్యార్థి ఓపీటీకి అనర్హుడు అవుతారు
  • యూనివర్సిటీ నియమించిన డీఎస్‌వో నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి

ఓపీటీ, సీపీటీ ప్రోగ్రామ్‌లను అమెరికా ఎందుకు పరిమితం చేయాలని భావిస్తోంది?
అమెరికాలోని ఓపీటీ, సీపీటీ ప్రోగ్రామ్‌లు తమ దేశ కాంగ్రెస్‌ నుంచి అధికారంగా ఆమోదం పొందలేదని హౌస్ జ్యుడిషియరీ కమిటీ విచారణలో ఇమ్మిగ్రేషన్ నిపుణుడు జెస్సికా ఎమ్ వాఘన్ ఈ ఏడాది జనవరి 22న తెలిపారు.కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, శిక్షణా కార్యక్రమాలు నకిలీవని, డబ్బును సంపాదించడానికి మాత్రమే ఉన్నాయని చెప్పారు.

ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నకిలీ డిప్లొమాను ఇస్తాయని తెలిపారు. వాటిని వాడి చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు పొందడానికి విదేశీయులు ప్రయత్నాలు జరుపుతారని చెప్పారు. ఇటువంటి నకిలీ ఇన్‌స్టిట్యూట్‌లను మూసేయాలని, వాటిని ఆపరేట్ చేయకుండా ఆపడానికి కఠినమైన నియమాలు ఉండాలని అన్నారు. భద్రతాపర ఆందోళనలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

అమెరికాలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, సీపీటీ కింద 539,382 మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారు.  ఓపీటీలో 2,76,452 మంది విద్యార్థులు, స్టెమ్ ఓపీటీలో 1,22,101 మంది, సీపీటీలో 1,40,829 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ ప్రోగ్సామ్‌లలో మార్పులు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది.