Russia ukraine war : అత్యాచారాలను కూడా రష్యా ఆయుధాలుగా వాడుతోంది..ఐరాసకు వెల్లడించిన యుక్రెయిన్
యుద్ధం చేయాలంటే ఆయుధాలుండాలి. సైన్యం ఉండాలి. కానీ రష్యా సేనలు యుక్రెయిన్ లో కేవలం ఆయుధాలతోనే యుద్ధం చేయటంలేదు..అత్యాచారాలను కూడా ఆయుధాలుగా వాడుతోంది అంటోంది యుక్రెయిన్.

Ukraine Rights Tells Russian Military Uses Rape As A Weapon Against Ukrainians
Ukraine rights tells Russian military uses rape as a weapon against Ukrainians : యుద్ధం చేయాలంటే ఆయుధాలుండాలి. సైన్యం ఉండాలి. కానీ రష్యా సేనలు యుక్రెయిన్ లో కేవలం ఆయుధాలతోనే యుద్ధం చేస్తున్నారా? బాంబులతోనే భవనాలను కూల్చేస్తున్నారా? అంటే అంతకంటే అత్యంత ఘోరానాకి పాల్పడుతోంది రష్యా అంటూ ఐక్యరాజ్యసమితికి తమ దేశపు ఆడబిడ్డలపై రష్యా ఆర్మీ చేస్తున్న దురాగతాలను చెప్పి వాపోయింది యుక్రెయిన్. ‘రష్యా సేనలు కేవలం బాంబులను,తుపాకులనే కాదు ‘అత్యాచారాలను’కూడా ఆయుధాలుగా వాడుతోంది అంటూ యుక్రెయిన్ మానవ హక్కుల సంఘం ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. ఇది అత్యంత ఘోరాతి ఘోరమని వాపోయింది. యుద్ధంలో ‘అత్యాచారం’ కూడా ఓ ఆయుధమేనా? అని నిర్ఘాంతపోయేంత దారుణాలకు రష్యా ఆర్మీ యుక్రెయిన్ పై దాడి చేస్తోంది అని..యుక్రెయిన్ బాలికలు, మహిళలపై రష్యా ఆర్మీ సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని వాపోయింది.
తాజాగా సోమవారం (ఏప్రిల్ 11,2022)యుక్రెయిన్ కు చెందిన లా స్ట్రాడా-ఉక్రెయిన్ అనే మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. లా స్ట్రాడా-ఉక్రెయిన్ సంస్థ అధ్యక్షురాలు కాటరీనా చెరెపఖా దీనిపై మాట్లాడుతూ.. రష్యా సైనికులు 12 మంది యుక్రెయిన్ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన 9 ఘటనలు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు.
ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, ఇంకా పెద్ద సంఖ్యలో రష్యన్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యన్ సైనికులు అత్యాచారం చేయడాన్ని ఓ అయుధంగా వాడుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ..ఆమె వీడియో ద్వారా ఐక్యరాజ్యసమితి అధికారికి తెలియజేశారు. కాటరీనా చెరెపఖాను ఉటంకిస్తూ, రష్యన్ సేనల అత్యాచార పర్వాన్ని ఆ ఐరాస అధికారి భద్రతామండలికి నివేదించారు.
కానీ ఇవన్నీ యుక్రెయిన్ తమపై ఆరోపణలు చేస్తోంది అని ఇవి ఏమాత్రం వాస్తవాలు కాదు అని రష్యా కొట్టిపారేసింది. యుక్రెయిన్ లో తాము సాధారణ పౌరుల జోలికి వెళ్లడంలేదని చెప్పుకొస్తోంది. ఈ ఆరోపణపై ఐక్యరాజ్యసమితి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిమా బహౌస్ మాట్లాడుతూ..న్యాయం..జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని ఆరోపణలను స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి అని అన్నారు.