US Restrictions Russia : రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన అమెరికా.. సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం

యుక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసిన ర‌ష్యాపై అమెరికా మ‌రిన్ని ఆంక్షలు అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ర‌ష్యా నుంచి సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమ‌తిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

US Restrictions Russia : రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన అమెరికా.. సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం

Usa

Updated On : March 12, 2022 / 4:19 PM IST

US Restrictions on Russia : తూటా పేల్చలేదు..! ఒక్కటంటే ఒక్క బాంబు కూడా విసరలేదు..! నేరుగా యుద్ధంలోకీ దిగలేదు. అయినా రష్యాని అన్నివిధాలా దెబ్బకొడుతోంది అమెరికా. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా స్ట్రేటజీ ఇప్పుడు పుతిన్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. యుక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యాను అమెరికా మరింతగా రెచ్చగొడుతోంది. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యాకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆర్థికంగా రష్యాను మరింత దిగజార్చాలన్న అమెరికా వ్యూహాన్ని రష్యా తిప్పికొట్టలేపోతోంది..! ఎందుకంటే దాదాపు అన్ని యూరప్‌ దేశాలు అమెరికా మాటే వింటున్నాయి..! అమెరికా దారిలోనే నడుస్తున్నాయి..! రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఆంక్షలతోనే పుతిన్‌ దళాలను కట్టడి చేస్తున్న అమెరికా.. ఈసారి రష్యా సీఫుడ్‌తో పాటు డైమండ్స్, వొడ్కాపై నిషేధం విధించింది.

USA : రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన అమెరికా

యుక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసిన ర‌ష్యాపై అమెరికా మ‌రిన్ని ఆంక్షలు అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ర‌ష్యా నుంచి సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమ‌తిపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రక‌టించారు. ర‌ష్యా నుంచి ప‌లు ర‌కాల వ‌స్తువుల దిగుమ‌తిపై నిషేధం అమ‌ల్లోకి తెస్తూ ప‌లు ఆదేశాలు జారీ చేశారు. మ‌రోవైపు, అమెరికా, దాని జీ-7 దేశాలు, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు కీల‌క నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటి వ‌ర‌కు ర‌ష్యాకు ఉన్న మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ అన్న హోదాను తొల‌గించేశాయి. దీంతో రష్యాతో వాటి శాశ్వత వాణిజ్య సంబంధాలు రద్దవుతాయి. దీనివ‌ల్ల ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల‌పై సుంకాలు పెరుగుతాయి. దీని కారణంగా ర‌ష్యా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మరోవైపు రష్యా పార్లమెంట్‌ దిగువ సభ డ్యూమాలోని 386 మంది సభ్యులపై ఇంగ్లండ్‌ ఆంక్షలు విధించింది.