Vladimir Putin: 69ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్! నిజమెంత?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 69ఏళ్లు. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్‌కు మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవాతో సంబంధం ఉందని, ఇప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, మరోసారి ఆమె గర్భందాల్చిందని వార్తా కథనాల సారాంశం.

Puthin
Vladimir Putin: ఉక్రెయిన్ పై రష్యా దాడుల కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో పుతిన్ గురించి పెద్దగా తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పుతిన్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. పుతిన్ కుటుంబం, వ్యక్తిగత జీవితం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Russia: అమెరికాలోని అలస్కా రాష్ట్ర భూభాగం మాది: రష్యాలో బిల్‌బోర్డుల కలకలం
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు 69ఏళ్లు. తన కుటుంబం గురించి పుతిన్ ఎప్పుడూ బయట మాట్లాడరు. మాజీ భార్య లిముద్ మిలాతో పుతిన్ కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో మారియా ఫాసన్ (37) వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరో కుమార్తె కేటెరినా టిఖోనొవా (35) శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే పుతిన్ కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, వీరికి 18ఏళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా చానెల్స్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
పుతిన్ ప్రేయసి మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా అని, ఆమె ప్రస్తుతం గర్భవతి అని వార్తలు అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో ఆమె.. మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానెల్ పేర్కొంది. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో ఆమెకు ఆడపిల్లగా తేలినట్లు వెల్లడించింది. అలీనా కబయోవాకు 39ఏళ్లు. ఆమెకు పుతిన్ కారణంగా ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Madhya Pradesh: అంబులెన్స్ కోసం తమ్ముడి మృతదేహంతో రోడ్డుపై కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు.. పోలీసులు రావడంతో..
వారి సంబంధం గురించి పుతిన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రతపడ్డారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్‌లో కొద్ది సంవత్సరాలు దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై పుతిన్ నుంచి కానీ రష్యా ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.
https://twitter.com/MerissaHansen17/status/1546134462009937921?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1546134462009937921%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fvladimir-putin-secreat-lover-alina-kabaeva-pregnant-1469704