RUSSIA: రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తాం..వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ

రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు.రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు...

RUSSIA: రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తాం..వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ

Yevgeny Prigozhin

Updated On : June 24, 2023 / 9:45 AM IST

RUSSIA: రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు. (Wagner chief vows)రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ( topple Russian military leadership)

Mutiny in Russia: రష్యాలో కిరాయి సైన్యం తిరుగుబాటు..మాస్కోలో హైఅలర్ట్

మొత్తం తన కిరాయి సైన్యం 25వేలమంది ఉన్నారని వారితో కలిసి పోరాడుతున్నామన్నారు. తమ వాగ్నర్ కిరాయి సైనికులు రష్యా దేశ ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.  రష్యా సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలు కూల్చివేసినట్లు అతను పేర్కొన్నాడు.వాగ్నల్ కిరాయి సైనికుల తిరుగుబాటు తర్వాత రష్యాలో సైనిక వాహనాలను మోహరించారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వాగ్నర్ ఫైటర్స్ ప్రిగోజిన్‌ను నిర్బంధించాలని కోరింది.