ఆమె ఏడ్చినా..చెమట పట్టినా,స్నానం చేసినా ప్రాణం పోతుంది..!!

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 09:19 AM IST
ఆమె ఏడ్చినా..చెమట పట్టినా,స్నానం చేసినా ప్రాణం పోతుంది..!!

చాలామందికి శరీరానికి ఎలర్జీలు వస్తుంటాయి. కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా చాలా వింత ఎలర్జీ. ఆమెకు ‘వాటర్ అలర్జీ’. ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా బొబ్బలు వచ్చేస్తాయి. పొరపాటున ఆమెపై నీటి చుక్క పడిందా..యాసిడ్ పడినట్లుగా అయిపోతుంది శరీరం. ఎంతగా అంటే ఆమె ఏడవకూడదు. కన్నీరు పడిన చోట ఎర్రగా బొబ్బలొచ్చాస్తాయి.చెమట కూడా ఆమెకు పట్టకూడదు.స్నానం కూడా చేయకూడదు. నీళ్లు పడితే చాలు.. యాసిడ్ పడినట్లుగా ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా మారిపోతుంది.

ఈ వింత అలర్జీతో టెస్సా హాన్సెన్ స్మిత్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. 21వ సంవత్సరాల వయస్సు ఉన్న టెస్సాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు  ‘వాటర్ అలర్జీ’ ఉన్నట్లుగా గుర్తించారు ఆమె తల్లిదండ్రులు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే. టెస్సా తల్లిదండ్రులిద్దరు డాక్టర్లే. 

టెస్సాకు 10 ఏళ్ల వయస్సు శరీరం అంతా అలర్జీ వస్తే..బహుశా షాంపూలు..సబ్బుల వల్ల ఇలా వస్తోందేమోననుకున్నారు. ఎన్నో షాంపూలూ..సబ్బులు మార్చారు. కానీ అదే పరిస్థితి. ఎన్నో టెస్టులు చేసిన తరువాత టెస్సాకు ‘ఆక్వాజెనిక్ ఆర్టికేరియా’ఉందని తెలుసుకుని షాకయ్యారు. ప్రపంచంలో 100 కంటే తక్కువ మందికి మాత్రమే ఈ అలర్జీ ప్రాబ్లమ్ ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ అలర్జీని నియంత్రించేందుకు టెస్సా రోజుకు 9 రకాల టాబ్ లెట్స్ వేసుకుంటుంది.

నీటి చుక్క పడితే జ్వరం 
టెస్సా పొరపాటున నీటిని తాకితే వెంటనే జ్వరం వచ్చేస్తుంది. చెమట పట్టినా..ఏడ్చినా..వర్షంలో తడిస్తే.. ఏకంగా ప్రాణాలు పోయేంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చెమటపడుతుందనే భయంతో 10 ఏళ్ల నాటి నుంచి ఆటలకు కూడా దూరంగా ఉంది. ఎక్కువగా నడవడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే చెమటపడుతుందని భయం.  అందుకే ఆమె చిన్ననాటి నుంచి కారులోనే తిరుగుతోంది. 

స్నానం చేయాంటే టాబ్ లెట్స్ వేసుకోవాల్సిందే..
ఈ అలర్జీ వల్ల టెస్సా నెలకు కేవలం రెండు సార్లే స్నానం చేసే సాహసం చేస్తుంది. అది కూడా భయంతో. ఎందుకైనా మంచిదని స్నానం చేసేముందు..చేసిన తరువాత కూడా అలర్జీకి సంబంధించిన టాబ్ లెట్స్ వేసుకుంటుంది. తన అలర్జీ గురించి టెస్సా మాట్లాడుతూ..నాకు ఏడుపు వచ్చినా కన్నీళ్లు కూడా కార్చలేని పరిస్థితి. చెమటపడితే జ్వరం వచ్చేస్తుంది. ఆఖరికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు తిన్నా..నోరు పుండులా మారిపోతుంది. ఐస్ క్రీమ్ తినలేను.ఫ్రూట్ జ్యూస్ లు తాగలేను ఇలా వాటర్ పర్సంటేజ్ ఉండే ఏదీ కూడా నాకు పడదు అంటూ వాపోయింది.  

ఈ అలర్జీ వల్ల టెస్సా నెలకు కేవలం రెండు సార్లే స్నానం చేసే సాహసం చేస్తుంది. అది కూడా భయంతో. ఎందుకైనా మంచిదని స్నానం చేసేముందు..చేసిన తరువాత కూడా అలర్జీకి సంబంధించిన టాబ్ లెట్స్ వేసుకుంటుంది.