Israel Palestine Conflict: యుద్ధంలో ఆసుపత్రులను ఎందుకు టార్గెట్ చేయకూడదు? అంతర్జాతీయ చట్టం ఏమిటి? ఎందుకు ఇజ్రాయెల్ దాన్ని పాటించడం లేదు?
ఆసుపత్రికి భద్రత కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుబట్టారు. అయితే, హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులను షీల్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని, అందుకే వారు ఆసుపత్రులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది

గత 40 రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు వైపులా సుమారు 13 వేల మంది మరణించారు. హమాస్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ముమ్మరంగా వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఈ భయంకరమైన దాడితో గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న అమాయక ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి.
హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ.. గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా, గాజా ఆరోగ్య సౌకర్యాలు పూర్తిగా కుప్పకూలాయి. నిత్యావసర వస్తువుల కొరత కారణంగా, గాజాలో ఉన్న దాదాపు అన్ని ఆసుపత్రులు మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. గాజాలో ఉన్న మొత్తం 36 ఆసుపత్రుల్లో 20కి పైగా పని చేయడం ఇప్పటికే ఆగిపోయిందని ఐక్యరాజ్యసమితి ఒక సందర్భంలో తెలిపింది.
#BREAKING #Israel #Gaza New Israeli attacks near the Al-Rantisi hospital in the Gaza Strip. pic.twitter.com/76VJnblBiO
— The National Independent (@NationalIndNews) November 10, 2023
గాజాలోని ఆసుపత్రులను ఖాళీ చేయాలంటూ ఆజ్రాయెల్ బెదిరింపులు
గాజా స్ట్రిప్‌లోని గృహాలు, ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడి చేస్తోందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులలో దాక్కున్నారని ఇజ్రాయెల్ సైన్యం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులను ఖాళీ చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఆసుపత్రులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం నిరంతరం ఒత్తిడి చేస్తోందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసుపత్రిలో చాలా మంది తీవ్రమైన రోగులు చికిత్స పొందుతున్నందున తాము అలా చేయడం కష్టమని వాపోతున్నారు. ఈ యుద్ధంలో ఆసుపత్రులు ప్రధాన చర్చగా మారాయి.
ఇది కూడా చదవండి: హిందూ దేవాలయంలో యూకే ప్రధాని దీపావళి వేడుకలు
అంతర్జాతీయ ఒప్పందం ఏం చెప్తోంది?
భద్రతా కోణంలో చాలా దేశాల ప్రజలు దీనిపై స్పందించారు. ఆసుపత్రికి భద్రత కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుబట్టారు. అయితే, హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులను షీల్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని, అందుకే వారు ఆసుపత్రులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. 1949 నాటి జెనీవాలో అంతర్జాతీయంగా ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. పాఠశాలలు, ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలు వంటి కొన్ని ప్రదేశాలు యుద్ధేతర ప్రాంతాలుగా ప్రకటించారు. ఏ శత్రువు కూడా ఆసుపత్రి వంటి స్థలాలపై దాడి చేయరాదు. అలాగే వాటిని ఖాళీ చేయమని కూడా అడగరాదు. అయితే, శత్రు సమూహం దుర్వినియోగం చేస్తే ఆసుపత్రి రక్షణను కోల్పోవచ్చని జెనీవా ఒప్పందం పేర్కొంటుంది.
IDF reveals Hamas weapons, gear and intelligence found throughout the Al-Shifa hospital. #FreeHamasfromGaza #FreePalestineFromIsrael #FreePalestine #Gaza_War #HamasTerrorist #HamasisISIS #Israel pic.twitter.com/Z6YkVZ1Nyv
— Israel war video report (@WKazingmei) November 15, 2023
జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ నేరాలు
జెనీవా ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీల చికిత్సను అడ్డుకోవడం, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, గాయపడిన వారికి చికిత్స అందకుండా చేయడం వంటివి వాటిని యుద్ధ నేరాలుగా పరిగణించారు. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి అమాయక పౌరులను చంపడం వంటి ఈ యుద్ధ నేరాలను కొన్ని హమాస్ చేసింది. అయితే గాజాలోని ఆసుపత్రులను ఖాళీ చేయాలంటూ గాజాపై ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తోంది.
ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం
అయితే హమాస్ మానవ కవచాలను ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెబుతున్నారు. తాము హమాస్ తీవ్రవాదులను నిర్మూలించాలని పట్టుబడుతున్నారు. పాలస్తీనియన్లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని, అమయితే హమాస్ తీవ్రవాదులు వారిని వెళ్ళడానికి అనుమతించడం లేదని అంటున్నారు. జెనీవా కన్వెన్షన్ ప్రోటోకాల్(I) ప్రకారం.. మానవ కవచాలను ఉపయోగించడం తప్పు, ఇది యుద్ధ నేరం అవుతుంది. ఇది మానవతా చట్టాన్ని ఉల్లంఘించినట్లే.