ఆరు చుక్కల అంధుల లిపి : ఫ్రాన్స్‌ ముద్దుబిడ్డ లూయీ బ్రెయిలీ 

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 08:01 AM IST
ఆరు చుక్కల అంధుల లిపి : ఫ్రాన్స్‌ ముద్దుబిడ్డ లూయీ బ్రెయిలీ 

Updated On : January 4, 2020 / 8:01 AM IST

అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన లూయీ బ్రెయిలీ శిష్యులు తమ గురువుగారి రూపొందించిన అంధులలిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేశారు. ఈ పోరాటా  ఫలితంగా ఫ్రాన్స్‌దేశం బ్రెయిలీలిపిని గుర్తించింది. లూయీ బ్రెయిలీని ఫ్రాన్స్‌ దేశ ముద్దుబిడ్డగా కొనియాడింది. కంటి చూపు లేకపోయినా..ముందు చూపు ఉన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. 

బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్‌ భాషకు వీలుగా రూపొందించబడిందంటే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. లూయిస్‌ మరణానంతరం లూయీ బ్రెయిలీ పేరు మీద స్టాంపులు, కరెన్సీ రూపొందించారు. పలు విద్యాసంస్థలకు, సిటీలకు ఆయన పేరు పెట్టుకున్నారు. భారతదేశం రెండు రూపాయల నాణెం మీద, యుఎస్‌ డాలర్‌ మీద లూయీ బ్రెయిలీ ముఖచిత్రాన్ని ముద్రించారు. ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్‌ స్టాంప్‌లను కూడా విడుదల చేశాయి. 

యూరప్‌లో 1873లో, యుఎస్‌ఏలో 1883లో బ్రెయిలీలిపి వాడుకలో వచ్చింది. మొదటిసారి ఇంగ్లిష్‌ భాషలోకి బ్రెయిలీని 1932లో ప్రవేశపెట్టారు. బ్రెయిలీలిపి నేర్చుకొని నేడు అంధులు విద్యావేత్తలుగా, సైంటిస్టులుగా, సంగీత కళాకారులుగా, చిత్రకళాకారులుగా ఎన్నో రంగాల్లో విజయాలను సాధిస్తున్నారు. దానికి కారణం లూయిస్‌ బ్రెయిలీ. అందుకే ఆయన అంధుల అక్షర శిల్పిగా వెలుగొందుతూనే ఉంటాడు. అంధుల మనస్సుల్లో, వారి మునివేళ్లల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటారు. 
ప్రపంచంలోని అంధుల జీవితాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి జీవితాల్లో వెలుగులు పంచుతున్నారు.  19 శతాబ్ధంలో కనిపెట్టిన ఆరు చుక్కల అంధుల లిపిని నేటికి ప్రపంచంలోని అన్ని దేశాల ఆంధులు విద్యావంతులుగా రాణించాలని లూయీ బ్రెయిలీ ఆకాంక్షించారు. ఆయన పడి కష్టానికి చేసిన కృషి పడిన తపన అంధులకు వెలుగునిచ్చాయి. విద్యాజ్యోతిని వెలిగించాయి. అంధులకోసం అవిశ్రాంత కృషి చేసిన లూయీ బ్రెయిలీ జనవరి 6,1852 తన 43 సంవత్సరాల వయస్సులో మరణించారు.