సిటీ మధ్యలో సముద్రం: ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ వేవ్ క్రాష్‌లు

  • Published By: dharani ,Published On : May 23, 2020 / 09:43 AM IST
సిటీ మధ్యలో సముద్రం: ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ వేవ్ క్రాష్‌లు

Updated On : May 23, 2020 / 9:43 AM IST

దక్షిణ కొరియాలో D’strict కంపెనీ అనామోర్ఫిక్ పబ్లిక్ ఆర్ట్ ఇల్లస్ట్రేషన్ తయారుచేసింది. 268 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తుతో… ఇది కొరియాలోనే అతి పెద్ద అవుట్‌డోర్ స్క్రీన్‌గా గుర్తింపుపొందింది. ఈ స్క్రీన్ అల్ట్రా హై డెఫినిషన్ కంటే రెండింతలు ఎక్కువ అంటే.. (7,840 x 1,952 pixels) ఉంటుంది. 

శామ్సంగ్ స్మార్ట్  LED టెక్నాలజీని ఉపయోగించి 1,620 చదరపు మీటర్ల స్మార్ట్ స్క్రీన్లో ఆర్ట్ ఇన్స్టాలేషన్ సృష్టించబడింది. దీన్ని పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. కానీ ఈ స్ర్కీన్ చూస్తుంటే.. నిజంగా సముద్రం దగ్గర ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి సిటీ మధ్యలో సముద్రం ఉన్నట్లుగా, అలలు వస్తున్నట్లుగా చాలా అద్భుతంగా దీన్ని నిర్మించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా… సిటీ మధ్యలో సముద్రం ఉన్నట్లుగా, అలలు వస్తున్నట్లుగా ఫీలవుతూ… కాస్త టెన్షన్లను తగ్గించుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 4లక్షలకు పైగ చూశారు. చూసినవారంతా వీడియోపై మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. 

Read: అమెరికా చట్టసభల్లో బిల్లు : H-1B వీసా జారీలో వారికే ప్రాధాన్యం!