Viral Video: ఎలుగుబంటితో పోరాడిన యువతి

Viral Video
Viral Video: పెంపుడు కుక్కలపై దాడికి యత్నించిన భారీ ఆకారపు ఎలుగుబంటిని ఒక్క ఊపుతో కిందపడేసింది ఓ యువతి.. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. దీనికి సంబందించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనిని కొందరు నెట్టింట్లో పెట్టడంతో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎలుగుబంటి.. దాని పిల్లలు గోడపై నడుస్తూ వెళ్తున్నాయి. ఇదే సమయంలో వాటిని గమనించిన కుక్కలు గట్టిగ అరుస్తూ ఎలుగుబంటి దగ్గరకు వెళ్లాయి.
ఎలుగుబంటి మొదట నల్ల కుక్కపై దాడిచేసేందుకు యత్నించగా ఎలుగు దాడి నుంచి నల్లకుక్క తప్పించుకుంది. ఇదే సాయంలో పక్కనే ఉన్న మరో చిన్న కుక్కపిల్లపై దాడి చేసేందుకు ఎలుగుబంతి గోడమీద నుంచి కిందకు దిగుతుండగా.. మెరుపు వేగంతో వచ్చిన హేలీ అనే యువతి దాన్ని ఒక్క ఉదిటిన గోడ అవతలకు తోసి కుక్క పిల్లను తీసుకోని ఇంట్లోకి పరుగుతీసింది.
ఇక ఈ సంఘటనపై హేలీ మాట్లాడుతూ మొదట ఓ భారీ గోధుమ రంగులోని ఎలుగుబంటి చూశాను. దాన్ని చూడగానే భయమేసింది. తన పెంపుడు కుక్కలపై దాడి చేసేందుకు అది యత్నిస్తుంది.. అది నా వాలెంటినాను పట్టుకుంటుంది. దానిని కాపాడాలనే ఉద్దేశంతో పరుగున వెళ్లి ఎలుగుబంటిని కిందకు తోసా.. చివరకు ఎలుగుబంటి కింద పడడంతో నా కుక్క పిల్లను తీసుకుని అక్కడ నుంచి వెనక్కి పరిగెత్తాను. ఆ సమయంలో లోపల భయం ఉన్నా..వాలెంటినాను కాపాడాలి అనే ఆలోచనతో వెళ్ళాను అని తెలిపారు.
This is crazy af omg pic.twitter.com/Sh14yVD9Eu
— Bria Celest (@55mmbae) June 1, 2021