భౌతిక దూరం లేకుండా మాస్క్ పెట్టుకున్నా వ్యర్థమే!

కరోనా వైరస్ సోకకుండా ఉండేదుకు 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచుగా చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలనే విషయం అందరికి తెలుసు. మూడు తప్పక పాటించాలని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్ పెట్టుకున్నాం కదా.. అని ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తే.. కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. భౌతిక దూరాన్ని పాటించకుండా కేవలం మాస్క్ పెట్టుకోవడం ద్వారా కరోనాను నివారించలేము. కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటిస్తూనే మాస్క్ పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం వంటివి చేస్తుండాలి. లేదంటే ప్రయోజనం ఉండదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది. మాస్క్.. భౌతిక దూరానికి ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పింది. మాస్క్‌తో పాటు తప్పనిసరిగా భౌతికదూరాన్ని పాటించాలని పేర్కొంది. అవసరమైన పనులను చేస్తున్నప్పుడు, ఆఫీసులకు వెళ్తున్నప్పుడు 6 అడుగుల భౌతిక దూరం పాటించడం అవసరమని తెలిపింది. కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీచేసింది.
కరోనా వైరస్ లక్షణాలు బయటకు కనిపించట్లేదు. వారివల్లే కరోనా వ్యాప్తి చెందినట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. లక్షణాలు లేవని భావించి ఎవరితోనూ సన్నిహితంగా మెలగొద్దు. ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఎవరితోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగించొద్దు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ములు లేదా మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లతో పక్కన ఉండే వారి నోట్లో లేదా ముక్కులో పడొచ్చు. ఒక్కోసారి ఊపిరి తిత్తుల్లోకి కూడా నేరుగా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇంటి సభ్యుల మధ్య 6 అడుగుల ద్వారాన్ని పాటించాలి. గుంపుల్లో తిరగొద్దు. కరోనా వ్యాధిని నివారించడానికి వ్యాక్సిన్ లేదు. ఎప్పట్లోగా వస్తుందో క్లారిటీ లేదు. అప్పటివరకూ తగిన జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు.
రెండేళ్లలోపు పిల్లలు, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు లేదా ఇతరత్రా సమస్యలుంటే మాస్క్‌లు ధరించకపోవడమే మంచిది. అలాంటి వారికి బదులు పక్కనున్న వ్యక్తులు ధరిస్తే.. ఎలాంటి హాని ఉండదు. వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారు కరోనా వైరస్‌కు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాయామం చేసిన 30 నిమిషాల్లో లేదా ఫీవర్ తగ్గించే మందులు తీసుకున్న తర్వాత థర్మల్ (జ్వర) పరీక్షలు చేయకూడదు. స్పష్టమైన ఫలితం రాదు. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది ఉంటే కరోనాగా అనుమానించాలి. లక్షణాలు ఉంటే శరీర ఉష్ణోగ్రత తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఆఫీసుల్లో ఒక్కోసారి మాస్క్ లేనప్పుడు దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేయి అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బునీరు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది ఉపయోగించే ఫేస్‌మాస్క్‌ను ధరించొద్దు.
Read: యోగ చేస్తే డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి: కొత్త రిసెర్చ్ తేల్చేసింది