Jaggery : రోజుకో బెల్లం ముక్క..ఆరోగ్యం పక్కా..
ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారటానికి దోహదపడుతుంది.

Jeggry (3)
Jaggery : తియ్యదనాన్ని ఇష్టపడని వారుండరు. అందునా చెరకు రసం నుండి తీసిన బెల్లం తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. చెరుకు నుండి రసాన్ని వేరు చేసి వేడి చేయటం ద్వారా పాకంగా మార్చి తరువాత దానిని అచ్చులుగా పోస్తారు. తియ్యదనం కోసం పంచదార కన్నా బెల్లం వినియోగించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఐరన్, కాల్సియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.
అయుర్వేదంలో బెల్లాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. ప్రతిరోజు ఆహారం తీసుకున్న తరువాత ఓ బెల్లం ముక్కను బుగ్గన పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ ఆలవాటు కలిగిన వారి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు ఇలా చేయటం వల్ల జీర్ణ వ్యవస్ధ మెరుగవ్వటమే కాక తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు అల్లాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాతపు నొప్పులన్నీ తొలగిపాతాయి. ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారటానికి దోహదపడుతుంది. బెల్లంలో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నందునే హిందూ సాంప్రదాయాల్లో దేవుని పూజా సమయంలో నైవేధ్యంగా బెల్లాన్ని ఉంచుతారు. బెల్లంతో చేసిన పొంగలి అన్నం తయారు చేసుకుని ఆరగిస్తారు. అరిసెలు, పూర్ణాలు వంటి వాటిని బెల్లం కలిపి తయారు చేస్తారు. మరి ముఖ్యంగా వివాహసమయంలో వధువరులు నెత్తిన జీలకర్ర,బెల్లం ఉంచటంతో సంగం పెళ్ళి తంతు పూర్తవుతుంది.
ఎన్నో ఉపయోగాలు ఉండటం వల్లే పూర్వకాలం నుండి బెల్లం ఆరోగ్యప్రదాయినిగా భావిస్తారు. అనేక గుణాలున్న బెల్లాన్ని రోజుకో ముక్క తీసుకోవటం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా దీర్ఘకాలం ఎలాంటి రోగాల భారిన పడకుండా అందులోని పోషకాలు మనల్ని రక్షిస్తాయని చెబుతున్నారు.