AAP Support : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు ఆప్ మద్దతు

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు. ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మార్గరెట్‌ అల్వాకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

AAP Support : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు ఆప్ మద్దతు

AAP Support : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు. ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మార్గరెట్‌ అల్వాకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీకి చెందిన సభ్యులందరూ ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఓటు వేస్తారని సంజయ్‌ సింగ్‌ చెప్పారు.

ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ను బరిలోకి దింపగా..విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వాను బరిలో నిలిపాయి. ఇప్పటికే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఎన్డీఏ అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌కు మద్దతు ప్రకటించింది.

TRS Support : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుపై ఉత్కంఠ

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నికలు జరుగుతున్నాయని యామావతి ట్వీట్‌ చేశారు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జగ్‌దీప్‌ ధన్‌కర్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.