Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ కోసం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసుతం వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు మీద ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన మోస్ట్....

Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ కోసం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్..?

Anirudh Ravichander In Talks For Ram Charan Next Movie

Updated On : March 17, 2022 / 11:55 AM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసుతం వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు మీద ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన రిలీజ్‌కు రెడీ అయ్యింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు చరణ్.

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ ఆ పాటలో ఉన్న వాళ్లంతా యుక్రెయిన్‌లే.. నాకు తోచిన సహాయం చేశాను..

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. RC15 పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చరణ్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. హీరో నానితో ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ కథగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు గౌతమ్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Ram Charan: చరణ్‌కు చెడు చేస్తున్న హీరో.. ఎవరంటే?

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌కు యావత్ సౌత్‌లో అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు దాదాపు అన్నికూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో చరణ్ 16వ చిత్రానికి అనిరుధ్‌తో సంగీతం చేయించేందుకు చిత్ర యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే తెలుగులో అనిరుధ్ సంగీతం అందించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, జెర్సీ సినిమాకు ఆయన ఇచ్చిన సంగీతం సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అనిరుధ్ అయితే చరణ్ సినిమాకు పర్ఫెక్ట్ సంగీతం అందిస్తాడని భావిస్తున్న గౌతమ్, ఈ మేరకు ఆయన్ను కోరారట. అయితే ఈ సినిమాలో చేసేది లేనిది అనే విషయంపై ఇంకా అనిరుధ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.