ఎలా మాట్లాడాలో నేర్చుకో : #BB3..బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేస్కోండి

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 02:17 AM IST
ఎలా మాట్లాడాలో నేర్చుకో : #BB3..బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేస్కోండి

Updated On : June 10, 2020 / 2:17 AM IST

తన పుట్టినరోజు సందర్భంగా జగదేకవీరుని కథలోని ‘శివ శంకరీ శివానంద లహరి’ పాటను పాడి అభిమానులను అలరించిన బాలయ్య.. ఫ్యాన్స్‌ కోసం మరో గిఫ్ట్ ఇచ్చాడు. బోయపాటి శ్రీనుతో చేస్తోన్న మూడో చిత్రానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో బాలయ్య పవర్‌ఫుల్‌గా డైలాగ్స్‌తో అదరగొట్టారు. మొత్తంగా అభిమానులు ఆశించే డైలాగులు.. ఎమోషన్స్ కంటెంట్‌తో దుమ్ము రేపాడు. 

ఫ్యాన్స్ కు బాలయ్య లేఖ : –
అభిమానులకు బాలకృష్ణ బహిరంగ లేఖ రాసారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులెవరూ పర్సనల్‌గా కలిసేందుకు రావద్దని విజ్ఞప్తి చేసారు. తన పుట్టినరోజును కనీవిని ఎరగని రీతిలో సెలబ్రేట్‌ చేస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే.. వారందరితో కలిసి వేడుకలు చేసుకోనే అదృష్టానికి అంతరాయం కలగడం భాధాకరమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో వారి ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వారి క్షేమమే తనకు కొండంత ఆశీర్వాదం అన్నారు. 

అదే అగ్రెషన్, అదే ఎనర్జీ : – 
అదే అగ్రెషన్, అదే ఎనర్జీ, అదే సాలిడ్ డైలాగ్ డెలివరీ తో కాస్త స్లిమ్ అయిన సీమ సింహంలా బాక్సాఫీస్‌ని రూల్ చేసే రూలర్ గా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ. కంప్లీట్ కమర్షియల్ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న బోయపాటి సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. తన స్టైల్లో యాక్షన్ ని ఎలివేట్ చేస్తూ..బోయపాటి డైరెక్షన్లో వస్తున్నసినిమాలో కూడా బాలయ్య డిఫరెంట్ గెటప్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు.

రివేంజ్ యాక్షన్ స్టోరి : – 
బోయపాటితో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో కూడా ఇలాగే ఫుల్ యాక్షన్ తో రాబోతున్నారు. ఆల్రెడీ ఫైట్ తోనే స్టార్ట్ చేసిన ఈ సినిమాకి ‘మోనార్క్’ అన్న టైటిల్ పెడదామని అనుకుంటున్నారట. యంగ్ స్టార్స్ తో పోటీపడుతూ యాక్షన్, ఫైట్స్ ఇలా..దేన్లో తగ్గకుండా ఫుల్ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఎవరెన్ని జానర్స్ చేసినా బాలయ్య మాత్రం తన మార్క్ రివేంజ్ యాక్షన్ స్టోరీ తో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 

ముచ్చటగా మూడోసారి : – 
అంతకు ముందు బోయపాటి – బాలకృష్ణ  కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు.. బాలయ్యలోని మరో యాక్షన్ యాంగిల్ ని చూపించి ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేశాయి. యాక్షన్ తోనే కాదు..డైలాగ్స్ తో సినిమా మొత్తం నడిపించి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు బాలయ్య. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్యను సరికొత్త లుక్ లో చూపించాయి. అందుకే ముచ్చటగా మూడో సారి తెరమీదకొస్తున్న ఈ కాంబినేషన్ మీ ఫుల్ గా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి బోయపాటి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవుతారో లేదో చూడాలి. 

Read: అవే డైలాగ్స్, అదే ఫోర్స్, అదే యాక్షన్ : హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ