chintamaneni prabhakar: తెలంగాణలో మాయమై ఏలూరులో ప్రత్యక్షమైన చింతమనేని
రైతుల సమస్యలపై ఏలూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు చింతమనేని వచ్చారు.

Chinthamaneni
chintamaneni prabhakar: హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం చినకంజర్లకు సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా పలువురు పట్టబడ్డ విషయం తెలిసిందే. అక్కడ కోడి పందేలు నిర్వహించిన వారిలో ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఉన్నారని, ఆయనతో పాటు పలువురు తాము రాగానే పరారయ్యారని పోలీసులు ఇప్పటికే వీడియో కూడా విడుదల చేశారు.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
ఈ ఆరోపణలు చింతమనేని మాత్రం కొట్టిపారేస్తున్నారు. అయితే, పటాన్‌చెరు నుంచి అదృశ్యమైన చింతమనేని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రైతుల సమస్యలపై ఏలూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు చింతమనేని వచ్చారు.