KA Paul: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది: కేఏ పాల్

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.

KA Paul: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది: కేఏ పాల్

Ka Paul

Updated On : July 26, 2022 / 1:39 PM IST

KA Paul: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. తన పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

‘‘ప్రతిపక్ష నేతలపై మోదీ.. సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారు. ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహించడం సరికాదు. ఈ విషయంలో న్యాయమూర్తులు, నిపుణులు స్పందించాలి. తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలి. మోదీ 76 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశం మరో శ్రీలంకలా మారుతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి. దేశ, రాష్ట్ర సంపదను ప్రభుత్వ నేతలు వారి నాయకులకు దోచి పెడుతున్నారు. అదానికి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులోని అంశాలను కేంద్రం అమలు చేయలేదు. చంద్రబాబు నేను చెప్పిన సలహాలను పట్టించుకోలేదు.

Clash In Pub: పబ్బులో యువకుడిపై అమ్మాయిల దాడి.. వీడియో వైరల్

ఆయన ప్రధాని కావడం కోసం, కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. మోదీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. చంద్రబాబు, జగన్, నేను కలిసి ఒకే వేదికపై చర్చకు సిద్ధం. చంద్రబాబు కలలో కూడా గెలవరు. ఏపీలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. రాష్ట్రానికి చంద్రబాబు తర్వాత మోదీ రెండో దోషి. ఆయన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. అనేక మంది జాతీయ నాయకులు నన్ను కలుస్తున్నారు. మోదీ కేసులతో వేధిస్తారని వారంతా భయపడుతున్నారు. మూడో దోషి.. జగన్ మోహన్ రెడ్డి. ఆయన తల్లి, తండ్రి నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. కానీ, జగన్ మాత్రం నన్ను కలవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు నవరత్నాలు అమలు చేయడానికి కూడా జగన్ వద్ద డబ్బులు లేవు.

Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

ఈ పథకాలకు డబ్బు ఎలా తెస్తారు? నాతో కలవండి. లేదా మా పార్టీలో చేరండి. పరిష్కారం చూపిస్తా. నాకు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ శత్రువులు కాదు. కానీ, పవన్ కల్యాణ్ పొత్తుల కోసం పార్టీలు మారుతున్నారు. తమ్ముడూ పవన్ కల్యాణ్… ఈ అన్నయ్యతో కలువు. నీకు అంతా మంచే జరుగుతుంది. నేనంటే పవన్‌కు గౌరవం. తమ్ముడు ముందుకు వస్తే కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్టులంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ప్రజలు ఇప్పుడు నాకు మద్దతు ఇవ్వాలి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.